సుప్రీంకోర్టుకెక్కిన రాజస్తాన్ చీఫ్ విప్

| Edited By: Pardhasaradhi Peri

Aug 01, 2020 | 4:13 PM

రాజస్తాన్ చీఫ్ విప్ మహేష్ జోషీ సుప్రీంకోర్టుకెక్కారు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తో బాటు , ఆయన వెంట ఉన్న 18 మంది రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో చర్య తీసుకోకుండా వాయిదా వేయాలంటూ స్పీకర్ కు రాజస్తాన్ హైకోర్టు జారీ..

సుప్రీంకోర్టుకెక్కిన రాజస్తాన్ చీఫ్ విప్
Follow us on

రాజస్తాన్ చీఫ్ విప్ మహేష్ జోషీ సుప్రీంకోర్టుకెక్కారు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తో బాటు , ఆయన వెంట ఉన్న 18 మంది రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో చర్య తీసుకోకుండా వాయిదా వేయాలంటూ స్పీకర్ కు రాజస్తాన్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఆయన సవాల్ చేశారు. ఆ ఉత్తర్వులు రాజ్యాంగ విరుధ్ధమని, చట్ట వ్యతిరేకమని జోషీ అన్నారు. 1992 లో ఓ కేసుకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన రూలింగ్ కి ఇది విరుధ్దమని కూడా జోషీ పేర్కొన్నారు. అనర్హత ప్రొసీడింగ్స్ ని నిర్ణయించే అధికారం స్పీకర్ దేనని, న్యాయపరమైన జోక్యం అనుమతించదగినది కాదని ఆ నాడే కోర్టు స్పష్టం చేసిందన్నారు.

కాగా-జైపూర్ సమీపంలోని ఓ హోటల్ లో ఉంటూ వచ్చిన…. సీఎం అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన సుమారు వందమంది ఎమ్మెల్యేలను జైసల్మీర్ కి తరలించారు. ఆగస్టు 14 వరకు వారిని గెహ్లాట్ వివిధ ప్రదేశాలకు తరలించే అవకాశాలున్నాయి. ఆగస్టు 14 నుంచి అసెంబ్లీని సమా  వేశపరచేందుకు గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ఇదివరకే తన అంగీకారాన్ని తెలిపారు. అటు-అశోక్ గెహ్లాట్ మళ్ళీ బీజేపీపై మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలను ఆ పార్టీ ప్రలోభ పెట్ట జూస్తోందని, అందువల్లే వారిని జైసల్మీర్ కి తరలించామని ఆయన అన్నారు.