Big Story: రాజస్తాన్..సీఎం అశోక్ గెహ్లాట్ సర్కారుకి సీఎల్పీ మద్దతు.. తీర్మానం ఆమోదం

| Edited By: Ravi Kiran

Jul 13, 2020 | 5:27 PM

రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్ఫీ) మద్దతు ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వారిపై గట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ తీర్మానంలో కోరారు. కాగా-తమ ఎమ్మెల్యేలను..

Big Story: రాజస్తాన్..సీఎం అశోక్ గెహ్లాట్ సర్కారుకి సీఎల్పీ మద్దతు.. తీర్మానం ఆమోదం
Follow us on

రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) మద్దతు ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వారిపై గట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ తీర్మానంలో కోరారు. కాగా-తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెట్టకుండా గెహ్లాట్ వారిని జైపూర్ బయట ఓ రిస్సార్టుకు తరలించారు. తనకు 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన ప్రకటించుకున్నారు. సోమవారం ఉదయం వీరితో ఆయన తన ‘బలాన్ని’ ప్రదర్శించారు. గెహ్లాట్ నిర్వహించిన ఈ సమావేశానికి సుమారు 102 మంది శాశన సభ్యులు హాజరయ్యారు. అటు-గెహ్లాట్ ప్రభుత్వంపై బాహాటంగా తిరుగుబాటు చేసిన డిప్యూటీ సీఎం సచిన్ పైలట్… ఢిల్లీలో తనకు మద్దతు నిస్తున్న ఎమ్మెల్యేలతో పార్టీ సీనియర్ నేతలను కలుసుకుంటున్నారు. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకుంటున్న ఆయన.. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం, సీఎం తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పిలుపుతో పైలట్ వారితో భేటీ అయ్యారు. జైపూర్ కి వెళ్లాలని, ప్రభుత్వంతో రాజీ పడాలని వారు ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. పైలట్.. ఇతర నేతలైన కెసి. వేణుగోపాల్, అహ్మద్ పటేల్, పి.చిదంబరం లను కూడా కలిశారు. మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ నేతలు తమ కొత్త డిమాండ్ బయట పెట్టారు.  .

200 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీలో 107 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. పది మంది ఇండిపెండెంట్ సభ్యులు కూడా గెహ్లాట్ సర్కార్ కి మద్దతునిస్తున్నారు. బీజేపీ నుంచి 73 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే.. ఈ పార్టీకి మరో 35 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. పార్టీ ఆదేశంపై పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా జైపూర్ చేరుకొని సంక్షోభ పరిష్కారానికి కృషి చేస్తున్నారు.