చైనా ‘బెడద’ పై రాహుల్ వ్యాఖ్య సరైనదే.. మహారాష్ట్ర మంత్రి బాలాసాహెబ్ థోరట్

| Edited By: Pardhasaradhi Peri

Jun 29, 2020 | 10:09 AM

చైనాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలు కావని, ప్రజలు ఇఛ్చిన బాధ్యతతో కూడిన  వ్యాఖ్యలుగా వాటిని పరిగణించాలని  మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, రెవెన్యూ శాఖ మంత్రి బాలాసాహెబ్ థోరట్ అన్నారు. చైనా, దేశ భద్రత వంటి అంశాల్లో..

చైనా బెడద పై  రాహుల్ వ్యాఖ్య సరైనదే.. మహారాష్ట్ర మంత్రి బాలాసాహెబ్ థోరట్
Follow us on

చైనాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలు కావని, ప్రజలు ఇఛ్చిన బాధ్యతతో కూడిన  వ్యాఖ్యలుగా వాటిని పరిగణించాలని  మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, రెవెన్యూ శాఖ మంత్రి బాలాసాహెబ్ థోరట్ అన్నారు. చైనా, దేశ భద్రత వంటి అంశాల్లో తమ పార్టీ ప్రభుత్వం వెంటే ఉంటుందని, అంత మాత్రాన ఈ విధమైన విషయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగరాదనడం సరికాదని ఆయన చెప్పారు. 1962 నాటి పరిస్థితిని ఇప్పటి పరిస్థితితో పోల్చజాలమన్నారు. చైనా దురాక్రమణ వల్లే గాల్వన్ లోయలో మన సైనికులు 20 మంది అమరులయ్యారని బాలాసాహెబ్ థోరట్ పేర్కొన్నారు. ప్రజల మనస్సులో ఉన్నదే రాహుల్ గాంధీ చెప్పారు. మేం దేశ భద్రత, చైనా చొరబాటు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం అన్నారాయన. ప్రధాని మోదీ తన ‘ మన్ కీ బాత్’ కార్యక్రమంలో చైనా చొరబాటు గురించి ఒక్క మాట అయినా మాట్లాడారా అని థోరట్ ప్రశ్నించారు. మౌనంగా ఉండడానికి ఇది సమయం కాదని, మా పార్టీ చేస్తున్న సూచనలను పాలిటిక్స్ గా విమర్శించడం బీజేపీకి తగదని ఆయన సలహా ఇఛ్చారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా బహుశా చైనా చొరబాటుపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది అని థోరట్ వ్యాఖ్యానించారు.