పరోక్షంగా శరద్ పవార్ పైనా రాహుల్ ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2020 | 6:11 PM

లదాఖ్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని మోదీతో బాటు తన ‘మిత్రుడు’, ‘శత్రువు’ శరద్ పవార్ పైనా విమర్శలు సంధించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను రాజకీయం చేయరాదన్న పవార్ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తూ.. ‘మనం మరి.. జాతి భద్రత’ పై ఎప్పుడు మాట్లాడతామని రాహుల్ ప్రశ్నించారు. 1962 లో జరిగిన యుధ్ధం అనంతరం చైనా మన భూభాగంలో 45 వేల చదరపు కిలోమీటర్ల భాగాన్ని ఆక్రమించుకుందన్న విషయం మరువరాదని పవార్ […]

పరోక్షంగా శరద్ పవార్ పైనా రాహుల్ ఫైర్
Follow us on

లదాఖ్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని మోదీతో బాటు తన ‘మిత్రుడు’, ‘శత్రువు’ శరద్ పవార్ పైనా విమర్శలు సంధించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను రాజకీయం చేయరాదన్న పవార్ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తూ.. ‘మనం మరి.. జాతి భద్రత’ పై ఎప్పుడు మాట్లాడతామని రాహుల్ ప్రశ్నించారు. 1962 లో జరిగిన యుధ్ధం అనంతరం చైనా మన భూభాగంలో 45 వేల చదరపు కిలోమీటర్ల భాగాన్ని ఆక్రమించుకుందన్న విషయం మరువరాదని పవార్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఒకప్పుడు రక్షణ మంత్రిగా ఉన్న తాను ఆ సమయంలో ఏం జరిగిందన్న విషయాన్ని కూడా పరిశీలించవలసి ఉందన్నారు. (కాంగ్రెస్ పార్టీతో బాటు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా మహారాష్ట్రలో శివసేన ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది).అయితే లదాఖ్ ఘటన విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య విభేదాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. ఈ ఘటన చాలా సెన్సిటివ్ అని, అది ప్రభుత్వ వైఫల్యం కాదని పవార్ పేర్కొన్నారు. దీంతో రాహుల్ గాంధీ.. కినుక వహించినట్టు భావిస్తున్నారు. జాతి భద్రత అన్నది అతి ముఖ్యమైన అంశమని, దీనిపై ఎవరైనా, ఎప్పుడైనా మాట్లాడవచ్చునని ఆయన అన్నారు. అటు-హోం మంత్రి అమిత్ షా కూడా.. రాహుల్ సంకుచిత రాజకీయాలకు పాల్పడుతున్నారని, దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై ట్వీట్లు చేయరాదని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం.