గురు గ్రంథ్ సాహిబ్ కేసు.. ఎఫ్ఐఆర్ లో నిందితునిగా రామ్ రహీమ్ సింగ్

| Edited By: Pardhasaradhi Peri

Jul 07, 2020 | 5:17 PM

గురు గ్రంథ్ సాహిబ్ 'అపవిత్రం ' కేసులో డేరా బాబా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీం సింగ్ ని నిందితునిగా పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇతని మరో ఏడుగురుసహచరుల..

గురు గ్రంథ్ సాహిబ్ కేసు..  ఎఫ్ఐఆర్ లో నిందితునిగా రామ్ రహీమ్ సింగ్
Follow us on

గురు గ్రంథ్ సాహిబ్ ‘అపవిత్రం ‘ కేసులో డేరా బాబా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీం సింగ్ ని నిందితునిగా పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇతని మరో ఏడుగురుసహచరుల పేర్లను కూడా వారు ప్రస్తావించారు. జులై 4 న ఫరీద్ కోట్ జిల్లాకు చెందిన  ఈ ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 2015 జూన్ 1 న ఈ జిల్లాలోని గురుద్వారా నుంచి గురు గ్రంథ్ సాహిబ్ ని చోరీ చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. నాడు ఈ ఘటనలో పెద్దఎత్తున పోలీసు  కాల్పులు, అల్లర్లు జరిగాయి. ఇద్దరు ఆందోళనకారులు మరణించారు. పంజాబ్ ప్రభుత్వం రెండు సిట్ లను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ కేసుపై దర్యాప్తు జరుగుతూ వచ్చింది. కాగా ప్రస్తుతం జైల్లో ఉన్న గుర్మీత్ రామ్ రహీం సింగ్ ని ఇన్నాళ్లకు ఈ కేసులో నిందితునిగా చేర్చడం విశేషం.