ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:05 PM

న్యూఢిల్లీ: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్ అంటే మండిపడుతున్నారు. పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఆయన పాక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పుల్వామా దాడికి బాధ్యత తమదే అని ప్రకటిస్తే, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటివరకు దాడిని ఖండించకపోవడాన్ని మోదీ తప్పుపట్టారు. రాజస్థాన్ లోని టోంక్ ప్రాంతంలో శనివారం జరిగిన బహిరంగ […]

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ
Follow us on

న్యూఢిల్లీ: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్ అంటే మండిపడుతున్నారు. పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఆయన పాక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పుల్వామా దాడికి బాధ్యత తమదే అని ప్రకటిస్తే, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటివరకు దాడిని ఖండించకపోవడాన్ని మోదీ తప్పుపట్టారు.

రాజస్థాన్ లోని టోంక్ ప్రాంతంలో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. పాకిస్థాన్‌కు ప్రధాని అయిన వెంటనే ఇమ్రాన్ ఖాన్‌ను మనస్ఫూర్తిగా అభినందించాను. దారిద్ర్యంపైనా, నిరక్షరాస్యతపైనా కలిసి పోరాడుదాం అన్నాను. అప్పుడు నేను పఠాన్ బిడ్డను, ఆడిన మాట తప్పను అని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. మాట మీద నిలబడతావో మాట తప్పుతావో తేల్చుకో ఇమ్రాన్ ఖాన్ అంటూ మోడీ అన్నారు.