మమతపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది, అమిత్ షా

| Edited By: Pardhasaradhi Peri

Nov 05, 2020 | 4:33 PM

బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆమె ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ కి ‘మృత్యు ఘంటికలు మోగడం’ ఆరంభమైందన్నారు. గురువారం బంకూరా జిల్లాను ఆయన సందర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను మమత ప్రభుత్వం తిరస్కరిస్తోందని ఆయన ఆరోపించారు. వచ్ఛే ఏడాది ఈ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడింట  రెండు వంతుల మెజారిటీ రావడం తథ్యమన్నారు. పశ్చిమ బెంగాల్ లో కొత్త ప్రభుత్వాన్ని […]

మమతపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది, అమిత్ షా
Follow us on

బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆమె ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ కి ‘మృత్యు ఘంటికలు మోగడం’ ఆరంభమైందన్నారు. గురువారం బంకూరా జిల్లాను ఆయన సందర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను మమత ప్రభుత్వం తిరస్కరిస్తోందని ఆయన ఆరోపించారు. వచ్ఛే ఏడాది ఈ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడింట  రెండు వంతుల మెజారిటీ రావడం తథ్యమన్నారు. పశ్చిమ బెంగాల్ లో కొత్త ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేస్తాం.. మోదీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మార్పును తెస్తాం అని అమిత్ షా ప్రకటించారు. పేద ప్రజలకోసం మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అడ్డుకోవడం ద్వారా బీజేపీని కూడా అడ్డుకోవాలని ‘దీదీ’ చూస్తున్నారని, కానీ ఆమె ప్రయత్నాలు సఫలం కావని ఆయన అన్నారు.,. ఆయన శుక్రవారం కూడా ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఓ గిరిజన కుటుంబంతో కలిసి లంచ్ చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.