అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’ కు ఆహ్వానం: శివన్

| Edited By: Pardhasaradhi Peri

Jun 25, 2020 | 1:48 PM

స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ లోకి ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చైర్మన్ కె.శివన్ గురువారం స్వాగతించారు. ‘ప్రభుత్వం తెచ్చిన

అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’ కు ఆహ్వానం: శివన్
Follow us on

స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ లోకి ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇస్రో చైర్మన్ కె.శివన్ గురువారం స్వాగతించారు. ‘ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను యువత వినియోగించుకుంటుందని భావిస్తున్నా. ఇప్పటికే కొన్ని స్టార్టప్ కంపెనీలు మమ్మల్ని సంప్రదించాయి. గ్లోబల్ స్పేస్ ఎకానమీకి ఇండియా హబ్ గా మారుతుందని బలంగా నమ్ముతున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ లోకి ప్రైవేటు సంస్థలను అనుమతిస్తూ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్(ఐఎన్–ఎస్ పీఏసీఈ)ను ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చింది. ఇది ప్రైవేటు కంపెనీలకు, భారత ప్రభుత్వ అంతరిక్ష సంబంధిత ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను వాడుకునేందుకు అనుమతులు జారీ చేస్తుంది.

[svt-event date=”25/06/2020,1:26PM” class=”svt-cd-green” ]