జియోలోకి మరో అమెరికా కంపెనీ

|

May 22, 2020 | 11:02 AM

దేశీయ దిగ్గజం రిలయన్స్‌ సంస్థ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఫేస్‌బుక్‌, సిల్వర్‌లేక్‌, విస్టా, జనరల్‌ అట్లాంటిక్‌ తర్వాత.. ఆ జాబితాలోకి మరో సంస్థ చేరిపోయింది. ప్రముఖ అమెరికా కంపెనీ కేకేఆర్‌, జియో మధ్య భారీ డీల్‌ కుదిరింది.

జియోలోకి మరో అమెరికా కంపెనీ
Follow us on

దేశీయ దిగ్గజం రిలయన్స్‌ సంస్థ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఫేస్‌బుక్‌, సిల్వర్‌లేక్‌, విస్టా, జనరల్‌ అట్లాంటిక్‌ తర్వాత.. ఆ జాబితాలోకి మరో సంస్థ చేరిపోయింది. ప్రముఖ అమెరికా కంపెనీ కేకేఆర్‌, జియో మధ్య భారీ డీల్‌ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రూ. 11వేల 367 కోట్ల పెట్టుబడులు కేకేఆర్‌ పెట్టనుంది. జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో 2.32శాతం వాటా కొనుగోలుతో.. కేకేఆర్‌ జియోలో అతిపెద్ద వాటాదారుగా మారనుంది.

ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ. ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన పెట్టుబడి సంస్థ కేకేఆర్‌ను రిలయన్స్‌లోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. భారతీయ డిజిటల్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధికి తాము చేస్తున్న ప్రయత్నంలో కేకేఆర్‌ భాగస్వామిగా ఉంటుందని.. భారతరీయులందరికి ప్రయోజనం కలిగేలా ముందుకు సాగుతామని ప్రకటించారు ముకేశ్ అంబానీ.

ఇక గత నెలరోజుల్లో ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు..జియోలో పెట్టుబడులు పెట్టడం ఇది ఐదోసారి. ఈ డీల్స్ ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రూ.78,562 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఫేస్‌బుక్‌ 43కోట్లతో 9.99శాతం వాటా..సిల్వర్‌ లేక్‌ 5,656 కోట్లు.. విస్టా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా జియో, కేకేఆర్‌ డీల్‌తో.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.