బ్రేకింగ్.. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

|

Aug 31, 2020 | 6:20 PM

భారత మాజీ రాష్ట్రపతి, సీనియర్ రాజకీయనేత ప్రణభ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో

బ్రేకింగ్.. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
Follow us on

భారత మాజీ రాష్ట్రపతి, సీనియర్ రాజకీయనేత ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన వయసు 84 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతోన్న ఆయన ఆర్మీ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. 13వ భారత రాష్ట్రపతిగా, కేంద్ర ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖతోపాటు అనేక పదవులు ఆయన అధిష్టించారు. ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ సోషల్‌ మీడియా వేదికగా తండ్రి మరణ వార్తను ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ జిల్లాలో ఉన్న మిరాఠి గ్రామంలో జన్మించారు. ఎంఏ(హిస్టరీ), ఎంఏ(పొలిటికల్ సైన్స్), ఎల్‌ఎల్‌బీ, డీ.లిట్ వంటి విద్యార్హతలు సంపాదించారు. చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్, జర్నలిస్టుగా కూడా పనిచేసిన ప్రణబ్ తర్వాత రాజకీయాల్లోకి చేరి ఎన్నో శిఖరాగ్రాలను అధిరోహించారు.

కరోనాతో పాటు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కూడా రావడంతో ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత కాలం కోమాలో కొనసాగిన ఆయన చివరికి ఇవాళ ప్రాణాలొదిలారు. ప్రణబ్ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా ప్రముఖులంతా తమ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు.