పరుగులు పెడుతోన్న పోలవరం

|

Aug 25, 2020 | 4:48 PM

పోలవరం ప్రాజక్టు పనులు స్థంభించిపోయాయి.. నత్తనడకన సాగుతున్నాయని ఓ పక్క విపక్షాలు గీపెడుతుంటే, అక్కడి వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు..

పరుగులు పెడుతోన్న పోలవరం
Follow us on

పోలవరం ప్రాజక్టు పనులు స్థంభించిపోయాయి.. నత్తనడకన సాగుతున్నాయని ఓ పక్క విపక్షాలు గీపెడుతుంటే, అక్కడి వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు సైతం పోలవరం పనులు ఏమాత్రం ఆగడంలేదు. అంతేకాదు, భారీ వరద ప్రవాహంలో కూడా పోలవరం పనులు మరింత జోరందుకున్నాయి. తాపీ, కాంక్రీటు పనులు ఒక పక్క జరుగుతున్నప్పటికీ సెంటరింగ్, గిర్డర్లు నిర్మించే పనులు చకచకా సాగిపోతున్నాయి. అదే సమయంలో పని క్వాలిటీ, ప్రమాణాలు, కార్మికులు, ఉద్యోగుల భద్రత విషయంలో నిర్మాణ సంస్థ మేఘా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇలాఉంటే, గత 10 రోజుల మాదిరే ఇప్పటికీ గోదావరి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. సగటున 15 లక్షల క్యూసెక్ల వరదనీరు నదిలో ప్రవహిస్తోంది. స్పిల్‌వే ప్రాంతంలో ఇంకా భారీగా వరద నీరు ప్రవహిస్తోండటం విశేషం.