ఈ నెల 16 నుంచి పాన్-ఇండియా వ్యాక్సినేషన్ , వర్చ్యువల్ గా లాంచ్ చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ , అందుబాటులో మరో నాలుగు వ్యాక్సిన్లు

| Edited By: Pardhasaradhi Peri

Jan 13, 2021 | 2:37 PM

ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా పాన్-ఇండియా వ్యాక్సినేషన్  ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ వర్చ్యువల్ గా లాంచ్ చేయనున్నారు..

ఈ నెల 16 నుంచి పాన్-ఇండియా వ్యాక్సినేషన్ , వర్చ్యువల్ గా లాంచ్ చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ , అందుబాటులో మరో నాలుగు వ్యాక్సిన్లు
Follow us on

ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా పాన్-ఇండియా వ్యాక్సినేషన్  ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ వర్చ్యువల్ గా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే 54.72 లక్షల డోసుల వ్యాక్సిన్ ఆయా రాష్ట్రాలు, నగరాల స్టోర్లకు చేరుకుంది. ఇది 1.65 కోట్ల డోసులకు పెరగవచ్చునని ప్రభుత్వం తెలిపింది. ఇందులో సీరం సంస్థ కోవిషిల్డ్ 1.1 కోట్ల డోసులు కాగా, భారత బయోటెక్ కొవాగ్జిన్ 55 లక్షల డోసులు ఉన్నాయి. ఇది గాక మరో 4 వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు-మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో తొలి కోవిషిల్ల్డ్ వ్యాక్సిన్ తో కూడిన ట్రక్కులు బుధవారం ప్రవేశించాయి. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాలకు వ్యాక్సిన్లు చేరుకున్నాయి.

ఇదిలా ఉండగా..ఇది ప్రపంచంలో మన అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అని మోదీ అభివర్ణించారు. మొదటి దశలో 3 కోట్లమంది హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 50 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. లోహ్రీ, సంక్రాంతి, పొంగల్, మాఘ్ బిహు వంటి పండుగల సీజన్ అనంతరం ఈ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన ఇదివరకే వెల్లడించారు.

Also Read:

రాచకొండ పోలీసుల అదుపులో లోన్ యాప్ కేటుగాళ్లు.. పట్టుబడినవారిలో ఓ చైనా జాతీయుడు

ట్రంప్ అభిశంసన ప్రక్రియకు సన్నాహాలు మొదలు, అయిదుగురు రిపబ్లికన్ల మద్దతు కూడా.. ఉపాధ్యక్షుని ఓటు డొనాల్డ్ కేనా

Sushant Hand-Written Note: నాజీవితంలో 30 ఏళ్ళు గడిపాను, అంటూ తన కలలు కోరికలను లెటర్ లో ఆవిష్కరించిన సుశాంత్