వారణాసివాసులతో ప్రధాని మోదీ ‘ముఖాముఖి’ !

| Edited By: Pardhasaradhi Peri

Mar 25, 2020 | 3:28 PM

తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో నివసించే స్థానికులతో ప్రధాని మోదీ ఇంటరాక్ట్ కానున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్నారు. దేశంలో కరోనా నేపథ్యంలో 21 రోజులపాటు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితుల మీద ఆయన వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని ప్రధాని సన్నిహిత వర్గాలు తెలిపాయి.  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కూడా ప్రజల్లో ఎవరికైనా ఈ లాక్ డౌన్ పై సందేహాలు ఉన్నా.. వాటిని నమో […]

వారణాసివాసులతో ప్రధాని మోదీ ముఖాముఖి !
Follow us on

తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో నివసించే స్థానికులతో ప్రధాని మోదీ ఇంటరాక్ట్ కానున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్నారు. దేశంలో కరోనా నేపథ్యంలో 21 రోజులపాటు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితుల మీద ఆయన వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని ప్రధాని సన్నిహిత వర్గాలు తెలిపాయి.  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కూడా ప్రజల్లో ఎవరికైనా ఈ లాక్ డౌన్ పై సందేహాలు ఉన్నా.. వాటిని నమో యాప్ లోని సంబంధిత సెక్షన్ కు నివేదించాలని మోడీ కోరారు. కోవిడ్-19 ని ఎదుర్కోవాలంటే ప్రజలు కఠిన పరిస్థితులపై ఒక అవగాహన కలిగి ఉండాలని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

ఇలా ఉండగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది. అయితే పాజిటివ్ లక్షణాలు కలిగినవారు చికిత్స పొంది డిశ్చార్జ్ అవుతున్న దాఖలాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నెల్లూరులో కరోనా సోకిన వ్యక్తికి మొదట నెగెటివ్ అని రిపోర్టు వఛ్చినప్పటికీ ఆ తరువాత అది పాజిటివ్ అని తేలింది. దీంతో ట్రీట్ మెంట్ పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.