కోవిడ్-19 వ్యాక్సీన్ పంపిణీపై ప్రధాని మోదీ ప్రసంగం ?

దేశంలో కోవిడ్-19 వ్యాక్సీన్ పంపిణీ గురించి ప్రధాని మోదీ ఈ సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగంలో వెల్లడించవచ్చునని భావిస్తున్నారు. నిన్న ఢిల్లీలో వర్చ్యువల్ గా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన..

కోవిడ్-19 వ్యాక్సీన్ పంపిణీపై ప్రధాని మోదీ ప్రసంగం ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 20, 2020 | 2:36 PM

దేశంలో కోవిడ్-19 వ్యాక్సీన్ పంపిణీ గురించి ప్రధాని మోదీ ఈ సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగంలో వెల్లడించవచ్చునని భావిస్తున్నారు. నిన్న ఢిల్లీలో వర్చ్యువల్ గా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన.. కేంద్ర తాజా ప్రతిపాదనల గురించిసూచనా ప్రాయంగా చెప్పారు. . దేశ ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చేలా కేంద్రం డిజిటల్ హెల్త్ ఐడీ విధానాన్ని ఉపయోగించుకుంటుందని ఆయన ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. వ్యాక్సీన్ డెవలప్ మెంట్ లో ఇండియా ముందంజలో ఉందని, వీటిలో కొన్ని పురోగమన దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. వ్యాక్సీన్ డెలివరీ సిస్టం ని పకడ్బందీగా అమలు చేస్తాం, ప్రజలకు డిజిటల్ హెల్త్ ఐడీని వినియోగిస్తాం అని ఆయన చెప్పారు.   మన ఇంద్రధనుష్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం లో దేశీయ రోటా వైరస్ వ్యాక్సీన్ ని కూడా  చేర్చాం  అని  మోదీ తెలిపారు.,