బోరిస్ జాన్సన్ వచ్ఛే నెల ఇండియాకు వస్తున్నారు, బ్రిటన్ మంత్రి తారిఖ్ అహ్మద్ నిర్ధారణ, ఇండియాతో మైత్రికే ప్రాధాన్యం

| Edited By: Pardhasaradhi Peri

Dec 23, 2020 | 3:20 PM

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్ఛేనెల ఇండియాకు వస్తున్నారని ఆ దేశ మంత్రి తారిఖ్ అహ్మద్ స్పష్టం చేశారు. భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు..

బోరిస్ జాన్సన్ వచ్ఛే నెల ఇండియాకు వస్తున్నారు, బ్రిటన్ మంత్రి తారిఖ్ అహ్మద్ నిర్ధారణ, ఇండియాతో మైత్రికే ప్రాధాన్యం
Follow us on

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్ఛేనెల ఇండియాకు వస్తున్నారని ఆ దేశ మంత్రి తారిఖ్ అహ్మద్ స్పష్టం చేశారు. భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఆయన ఇండియాకు వెళ్లడం ఖాయమని తారిఖ్ ట్వీట్ చేశారు. జనవరిలో జాన్సన్ భారత పర్యటనకు ముఖ్యమైన గ్రౌండ్ వర్క్ సాగుతోందని, విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ ఇదే పనిలో ఉన్నారని అయన తెలిపారు. ఇండో-పసిఫిక్ రీజన్ లో శాంతి కోసం జరుపుతున్న కృషిలో భాగంగా ఇండియాతో గట్టి మైత్రీ బంధాన్ని తాము కోరుతున్నామన్నారు. డొమినిక్ రాబ్ కు సంబంధించి వీడియోను కూడా ఆయన తన ట్వీట్ కు జత చేశారు. యూకే లో విస్తరిస్తున్న మ్యుటెంట్ వైరస్ కారణంగా బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఉండకపోవచ్చునని బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ చాంద్ నాగ్ పాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూకే ఫారిన్ కామన్ వెల్త్ అండ్ డెవలప్ మెంట్ ఎఫైర్స్ (సౌత్ ఏసియా) మంత్రి తారిఖ్ అన్వర్ దీనిపై క్లారిటీ ఇవ్వడం విశేషం.

ఇలా ఉండగా బ్రిటన్ మ్యుటెంట్ వైరస్ పై పరిశోధనలు సాగుతున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ ని మించి 70 శాతం ఇన్ఫెక్షన్ తో కూడినదని వస్తున్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్పష్టమైన ప్రకటన ఏదీ చేయనప్పటికీ.. రీసెర్చర్లు దీనిపై దృష్టి పెట్టారు. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు ఎలాంటి మోర్టాలిటీ కేసు ఇంకా నమోదు కాలేదని అంటున్నారు. యూకే లో కొన్ని ప్రాంతాలకు ఇది పరిమితమైందని కొందరు అభిప్రాయపడుతున్నారు.