ఎగిరే పళ్ళాలపై అమెరికా ఇన్వెస్టిగేషన్, చైనా పైనే ఫోకస్

| Edited By: Pardhasaradhi Peri

Aug 15, 2020 | 2:54 PM

ఆకాశంలో అప్పుడప్పుడూ కనిపించే అన్  ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ (ఎగిరే పళ్ళాల) పై  దర్యాప్తు కోసం అమెరికా నడుం బిగించింది. ఇందులో భాగంగా రక్షణ వ్యవస్థ..

ఎగిరే పళ్ళాలపై అమెరికా ఇన్వెస్టిగేషన్, చైనా పైనే ఫోకస్
Follow us on

ఆకాశంలో అప్పుడప్పుడూ కనిపించే అన్  ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ (ఎగిరే పళ్ళాల) పై  దర్యాప్తు కోసం అమెరికా నడుం బిగించింది. ఇందులో భాగంగా రక్షణ వ్యవస్థ..పెంటగాన్..అన్ ఐడెంటిఫైడ్ ఏరియల్  ఫెనామినా టాస్క్ ఫోర్స్ అనే బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎగిరే పళ్ళాల కథా, కమామిషు ఏమిటి,అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటి సోర్స్ ఏమిటి తదితర అంశాలపై ఇన్వెస్టిగేషన్ కి ఈ బృందం శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో అంతరిక్షంలో చైనా గూఢచర్యం నెరపుతోందని కూడా అనుమానిస్తున్న పెంటగాన్.. ఆ దేశం డ్రోన్లను, ఆకాశ విహంగాలను కూడా వినియోగిస్తోందని ఆరోపిస్తోంది. అనధికారికంగా ఏ విమానమైనా మా దేశ ట్రెయినింగ్ రేంజిలోకి చొరబడితే సహించేది లేదని పెంటగాన్ అధికార ప్రతినిధి సుశాన్ గఫ్ అన్నారు. గుర్తు తెలియని ఎగిరే పళ్ళాల అంశం ఇంకా మిస్టరీగానే ఉందని, లోగడ మా దేశీ నేవీ అధికారులు వీటికి సంబంధించిన మూడు వీడియోలను రిలీజ్ చేశారని సుసాన్ పేర్కొన్నారు. అత్యంత వేగంగా ప్రయాణించే ఇవి పవర్ ఫుల్ సెన్సర్లను ఉపయోగిస్తున్నాయని భావిస్తున్నట్టు ఆ ప్రతినిధి చెప్పారు.