గూగుల్, వికీపీడియాపై పాకిస్తాన్ మండిపాటు, మీ కంటెంట్ అభ్యంతరకరంగా ఉందని విమర్శ, నోటీసులు జారీ

| Edited By: Pardhasaradhi Peri

Dec 27, 2020 | 6:55 PM

గూగుల్, వికీపీడియాలపై పాకిస్తాన్ మండిపడింది. వీటిలో ముఖ్యంగా మత సంబంధమైన కంటెంట్ పూర్తి అభ్యంతరకరంగా ఉందని దుయ్యబట్టింది. మహమ్మద్ ప్రవక్త ఫై ప్రచురించిన..

గూగుల్, వికీపీడియాపై పాకిస్తాన్ మండిపాటు, మీ కంటెంట్ అభ్యంతరకరంగా ఉందని విమర్శ, నోటీసులు జారీ
Follow us on

గూగుల్, వికీపీడియాలపై పాకిస్తాన్ మండిపడింది. వీటిలో ముఖ్యంగా మత సంబంధమైన కంటెంట్ పూర్తి అభ్యంతరకరంగా ఉందని దుయ్యబట్టింది. మహమ్మద్ ప్రవక్త ఫై ప్రచురించిన క్యారికేచర్స్ హేళన చేసేవిగా ఉన్నాయని, ఖురాన్ లోని అంశాలు  దాదాపు వక్రీకరించే విధంగా పేర్కొన్నారని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ తెలిపింది. చట్ట విరుధ్దమైన ఈ విధమైన కంటెంట్ ను, క్యారికేచర్స్ ను తక్షణమే తొలగించాలని గూగుల్, వికీపీడియాలను ఈ సంస్థ కోరింది. మత నాయకుడు మీర్జా మస్రూర్ అహమద్ ను ప్రస్తుత ఖలీఫా గానో, లేదా ఇస్లాం నాయకుడిగానో చిత్రీకరించారు.. కానీ ఇది మా మత విశ్వాసాలకు పూర్తి విరుద్ధం.. గూగుల్ ప్లే స్టోర్ లో పవిత్ర  ఖురాన్ లోని అంశాలకు అనధికారిక వెర్షన్ ను జోడించారు అని ఈ అథారిటీ పేర్కొంది. మీర్జా మస్రూర్ మీద వికీపీడియాలో అసంబధ్ధమైన ఆర్టికల్స్ ప్రచురించారని, ఆయన ప్రస్తుత నాయకుడు కాకున్నా తాము ఆయనను గౌరవిస్తామని పాక్ వెల్లడించింది. తాము పంపిన నోటీసులకు వెంటనే వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించింది.