మ్యూజియంలో అభినందన్ బొమ్మ.. మరోసారి విషం కక్కిన పాక్..!

| Edited By:

Nov 11, 2019 | 12:26 PM

అభినందన్ వర్థమాన్.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. పాకిస్థాన్‌పై ఎంతో ధైర్యంతో.. దాడి చేసి.. పాకిస్థాన్ నుంచి సేఫ్‌గా బయటకు వచ్చిన వ్యక్తి. మళ్లీ ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. పాకిస్థాన్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ ప్రత్యక్ష్యమయ్యింది. ఏంటి షాక్ అయ్యారా..? మీరు వింటున్నది నిజమే..! భారత వాయుసేన పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ బొమ్మను.. కరాచీలోని పాకిస్థాన్ ఎయిర్‌ ఫోర్స్‌ మ్యూజియంలో పెట్టారు. ఎందుకు పెట్టారో.. ఏమిటో తెలీదు కానీ.. […]

మ్యూజియంలో అభినందన్ బొమ్మ.. మరోసారి విషం కక్కిన పాక్..!
Follow us on

అభినందన్ వర్థమాన్.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. పాకిస్థాన్‌పై ఎంతో ధైర్యంతో.. దాడి చేసి.. పాకిస్థాన్ నుంచి సేఫ్‌గా బయటకు వచ్చిన వ్యక్తి. మళ్లీ ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. పాకిస్థాన్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ ప్రత్యక్ష్యమయ్యింది. ఏంటి షాక్ అయ్యారా..? మీరు వింటున్నది నిజమే..!

భారత వాయుసేన పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ బొమ్మను.. కరాచీలోని పాకిస్థాన్ ఎయిర్‌ ఫోర్స్‌ మ్యూజియంలో పెట్టారు. ఎందుకు పెట్టారో.. ఏమిటో తెలీదు కానీ.. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. అక్కడి జర్నలిస్ట్ అన్వర్ లోధి.. అభినందన్‌ ఫొటోను తీసి తన ట్విట్టర్‌లొ పోస్ట్ చేశాడు. అన్వర్.. ట్వీట్ చేస్తూ.. అభినందన్ బొమ్మను పెడుతూ.. అతని చేతిలో టీ కప్పు కూడా పెడితే.. ఇంకా బాగుండేదని ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 27న అభినందన్ పాక్‌ సైన్యానికి పట్టుబడిన సంగతి తెలిసిందే. మిగ్-21 విమానాన్ని నడుపుకుంటూ.. పొరపాటున పాక్ గగనతలంలోకి ప్రవేశించగా.. దాన్ని కూల్చి వేశాయి పాక్ దళాలు. మొదట అందరూ.. అభినందన్ చనిపోయాడని అనుకున్నా.. అతన్ని బంధీగా పట్టుకున్నాయి పాక్ దళాలు. నానా చిత్ర హింసలు పెడుతూ.. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అప్పుడు దీనిపై.. ప్రపంచ వ్యాప్తంగా.. రచ్చరచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం.. వివిధ దేశాల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువగా రావడంతో.. మార్చి 1న అతన్ని ఇండియాకు అప్పగించారు పాక్ సైనికులు.