పెషావర్, పాఠాలు జరుగుతుండగా పేలిన బాంబులు

| Edited By: Anil kumar poka

Oct 27, 2020 | 11:56 AM

పెషావర్ లోని మదర్సాలో విద్యార్థులకు టీచర్లు పాఠాలు నేర్పుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఖురాన్ బోధించడానికి ఉద్దేశించిన హాలులోకి ఎవరో వ్యక్తి వచ్చి ప్లాస్టిక్ బ్యాగ్ ను వదిలాడని, పేలుడుకు ముందు కామ్..

పెషావర్, పాఠాలు జరుగుతుండగా పేలిన బాంబులు
Follow us on

పెషావర్ లోని మదర్సాలో విద్యార్థులకు టీచర్లు పాఠాలు నేర్పుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఖురాన్ బోధించడానికి ఉద్దేశించిన హాలులోకి ఎవరో వ్యక్తి వచ్చి ప్లాస్టిక్ బ్యాగ్ ను వదిలాడని, పేలుడుకు ముందు కామ్ గా నిష్క్రమించాడని పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారని వారు చెప్పారు. ఈ ఘోర ఘటనలో ఏడుగురు మృతి చెందగా అనేకమంది గాయపడ్డారు.

ఇస్లామాబాద్ కు సుమారు 170 కి.మీ. దూరంలో ఉంది పెషావర్ సిటీ ! ఒకప్పుడు ఈ నగరం ఉగ్రవాద హింసతో అట్టుడికింది. జిహాదీలు భద్రతాళాలను టార్గెట్ గా చేసుకుని బాంబు దాడులకు పాల్పడేవారు. ఇటీవలి సంవత్సరాల్లో ఆఫ్ఘనిస్తాన్ తో గల సరిహద్దుల్లో సైనిక చర్యలను ప్రభుత్వం పెంచడంతో పాక్ లో హింస చాలావరకు తగ్గింది. అయితే ఉగ్రవాద బృందాలు మాత్రం ఇంకా చురుకుగానే ఉన్నాయి.