‘ మా జాబ్ ముగిసింది.. ఇక వెనక్కి కదులుతాం, కానీ మా లక్ష్యం మారలేదు’, రైతు సంఘాల నేతలు

| Edited By: Ram Naramaneni

Jan 26, 2021 | 4:03 PM

ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడించిన అన్నదాతలు చెలరేగిపోయారు. ఇక్కడి ఓ స్తంభం పైకి ఎక్కి తమ పతాకాలను ఎగురవేసిన అన్నదాతల తాలూకు దృశ్యాలు,

 మా జాబ్ ముగిసింది.. ఇక వెనక్కి కదులుతాం, కానీ మా లక్ష్యం మారలేదు, రైతు సంఘాల నేతలు
Follow us on

ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడించిన అన్నదాతలు చెలరేగిపోయారు. ఇక్కడి ఓ స్తంభం పైకి ఎక్కి తమ పతాకాలను ఎగురవేసిన అన్నదాతల తాలూకు దృశ్యాలు, పోలీసులతో ఘర్షణ పడుతున్న ఉదంతం తాలూకు వీడియోలు వైరల్ అయ్యాయి. మొదట రెడ్ ఫోర్ట్ బయట రామ్ లీలా మైదాన్ వద్ద తమ ట్రాక్టర్లతో మోహరించిన వేలాది రైతులు ఆ తరువాత అనూహ్యంగా రెడ్ ఫోర్ట్ కు బయలుదేరారు. అక్కడ ఏకంగా పోలీసుల పైకి ట్రాక్టర్ ఎక్కించడానికి ప్రయత్నించడంతో వారు పరుగులు తీశారు. ఇంత రచ్ఛ జరిగిన అనంతరం వీరిని శాంతించడానికి పోలీసులు కొంతవరకు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. వీరితో సంప్రదింపులు జరిపారు. ఓ రైతు నేత మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వానికి ఓ సందేశం ఇవ్వడానికి తాము వచ్చామని, తమ ‘జాబ్’ ముగిసిందని, ఇక తిరిగి వెళ్తున్నామని అన్నారు. కానీ రైతు చట్టాలను రద్దు చేయాలన్న తమ లక్ష్యం మారలేదన్నారు.