
వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలను రెండు వారాల నుంచి 4 వారాల పాటు ‘దిగ్బంధం’ (లాక్ డౌన్) చేయాలనీ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం.. ప్రభుత్వాన్ని
100 బిలియన్ డాలర్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించిన ట్రంప్
అమెరికాలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 113 కి చేరుకుంది. దాదాపు 9 వేల మందికి ఈ వ్యాధి పాజిటివ్ లక్షణాలు కనిపిచినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలోని ఉద్యోగులందరికీ 10 రోజుల పెయిడ్ లీవును ఇస్తున్నామని, కరోనా అనుమానితులకు ఉచితంగా టెస్టులు జరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన ప్రకటించిన కరోనా రిలీఫ్ ప్యాకేజీకి సెనేట్ లో 90 మంది సభ్యుల మద్దతు లభించింది. ఈ బిల్లును కేవలం 8 మంది వ్యతిరేకించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందికి పైగా కరోనా వ్యాధిగ్రస్థులు మరణించారు. ఒక్క ఇటలీలోనే 2,900 మంది మృత్యువాత పడగా.. 35 వేల కేసులు నమోదయ్యాయి.
ఇరాన్ లో చిక్కుబడిన 255 మందిభారతీయులకు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయని, 17 వేల కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బ్రిటన్, మలేసియా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతోంది.