Conjoined twins: ఇండియాలో తొలి వినూత్న సర్జరీ విఫలం, ఒడిషా ఆసుపత్రిలో జంట కవలల్లో ఒకరి మృతి

| Edited By: Pardhasaradhi Peri

Nov 26, 2020 | 2:49 PM

ఒడిషా లో శరీర భాగాలు అతుక్కుని పుట్టిన జంట కవలల్లో ఒకరు మృతి చెందారు. మూడేళ్ళ క్రితం దేశంలోనే మొదటిసారిగా 'క్రోనియోపేగస్' అనే వినూత్న సర్జరీ ని ఈ కవలలకు చేసి..

Conjoined twins: ఇండియాలో తొలి వినూత్న సర్జరీ విఫలం, ఒడిషా ఆసుపత్రిలో జంట కవలల్లో ఒకరి మృతి
Follow us on

ఒడిషా లో శరీర భాగాలు అతుక్కుని పుట్టిన జంట కవలల్లో ఒకరు మృతి చెందారు. మూడేళ్ళ క్రితం దేశంలోనే మొదటిసారిగా ‘క్రోనియోపేగస్’ అనే వినూత్న సర్జరీ ని ఈ కవలలకు చేసి వీరిని వేరు చేశారు. . ఇప్పటివరకు ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించిన ట్విన్స్ లో కాలియా అనే పసిబిడ్డ బుధవారం మరణించినట్టు కటక్ లోని ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. 2017 లో ఢిల్లీలోని ఎయిమ్స్ లో వీరికి ఈ ఆపరేషన్ నిర్వహించారు. రెండేళ్ల అబ్జర్వేషన్ అనంతరం తదుపరి చికిత్స కోసం వీరిని కటక్ హాస్పిటల్ కి తరలించారు. కానీ కాలియా కన్ను మూశాడు. 14 మంది డాక్టర్లతో కూడిన బృందం సుమారు పది గంటలు శ్రమించినా ఆ పసికందును బ్రతికించలేకపోయారు. ఒడిషా లోని కాందహార్ జిల్లాలో ఓ గిరిజన మహిళకు ఈ కంజాయిన్డ్  ట్విన్స్ జన్మించారు.  నిజానికి క్రోనియోపేగస్ సర్జరీ అన్నది అత్యంత క్లిష్టమైనది. ఈ కవలలను ఈ ఆపరేషన్ ద్వారా వేరు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.