‘మీ జీవితాలను మెరుగుపరచలేకపోతున్నా’ , కిమ్ జాంగ్ ఉన్ కంట తడి

| Edited By: Anil kumar poka

Oct 13, 2020 | 11:18 AM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తనకూ ఓ మనసుందని నిరూపించుకున్నాడు. ఎప్పుడూ ఏడవని ఈయన ఓ మిలిటరీ పరేడ్ లో సైనికులను చూసి భావోద్వేగంతో కంటతడి పెట్టాడు. వారికి క్షమాపణలు చెప్పాడు.

మీ జీవితాలను మెరుగుపరచలేకపోతున్నా , కిమ్ జాంగ్ ఉన్ కంట తడి
Follow us on

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తనకూ ఓ మనసుందని నిరూపించుకున్నాడు. ఎప్పుడూ ఏడవని ఈయన ఓ మిలిటరీ పరేడ్ లో సైనికులను చూసి భావోద్వేగంతో కంటతడి పెట్టాడు. వారికి క్షమాపణలు చెప్పాడు. మీ జీవితాలను మెరుగు పరచలేకపోతున్నా.. మీకు మరింత మంచి లైఫ్ ఇన్ ఇవ్వలేకపోతున్నా అన్నాడు. పాలక వర్కర్స్ పార్టీ 75 వ యానివర్సరీ సందర్భంగా మాట్లాడిన ఆయన, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, కరోనా వైరస్ ను అదుపు చేయడంలోను మీరు అసమాన కృషి చేస్తున్నారని అన్నాడు. దేశంలో కోవిడ్ బారిన ఒక్కరు కూడా పడలేదంటే అందుకు మీ శ్రమ,  మీ సేవలే కారణమని, అలాంటిది మీకు నేను  మంచి లైఫ్ ఇవ్వదలచినా ఆ విషయంలో విఫలమయ్యానని బావురుమన్నాడు. నన్ను మీరు నమ్మారు..నాపై విశ్వాసం ఉంచారు.. కానీ..అంటూ దాదాపు వెక్కివెక్కి ఏడ్చినంత పని చేశాడు కిమ్ .తమ నేత కంట తడి చూసి సైనికులు, ప్రజలు కూడా తమ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. మొత్తానికి ఈ యానివర్సరీ కార్యక్రమంలో  విషాదం తాండవించింది.

ఉత్తర కొరియా అణుబాంబు, క్షిపణి ప్రయోగాలను ఆపకపోతే ఆంక్షలు విధిస్తామని అమెరికా ఇతర దేశాలు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ దేశానికి ఆయా దేశాల నుంచి సాయం అందకుండా పోతోంది. దీంతో   నార్త్ కొరియా లో ఆర్థిక మాంద్యం నెలకొంటోంది.