కోవిడ్ రోగుల ఇళ్ల బయట పోస్టర్స్ తొలగింపు, ఢిల్లీ సర్కార్ వెల్లడి

| Edited By: Anil kumar poka

Nov 03, 2020 | 1:55 PM

కోవిడ్ రోగులు, లేదా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారి ఇళ్ల బయట పోస్టర్స్ ను తొలగించాలని తాము అధికారులను ఆదేశించినట్టు ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

కోవిడ్ రోగుల ఇళ్ల బయట పోస్టర్స్ తొలగింపు, ఢిల్లీ సర్కార్ వెల్లడి
Follow us on

కోవిడ్ రోగులు, లేదా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారి ఇళ్ల బయట పోస్టర్స్ ను తొలగించాలని తాము అధికారులను ఆదేశించినట్టు ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అలాగే కరోనా వైరస్ రోగుల వివరాలను తమ పొరుగు వారితో వాట్సాప్ ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకోరాదని కూడా సూచించినట్టు వెల్లడించింది. ఈ రోగుల ఇళ్ల బయట తలుపులకు పోస్టర్లు అంటించి వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, ఈ గైడ్ లైన్స్ ను రద్దు చేసేలా చూడాలని కోరుతూ దాఖలైన పిల్ ను కోర్టు విచారించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ సత్యకామ్ వాదిస్తూ.. ఈ విధమైన గైడ్ లైన్స్ ఇదివరకు ఉండేవని, కానీ వీటిని చాలా రోజులక్రితమే ఉపసంహరించామని చెప్పారు. ఇక కరోనా రోగుల ఇళ్ల బయట పోస్టర్స్ ఉండబోవన్నారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన కోర్టు… ఈ పిల్ ను డిస్పోజ్ చేసేసింది.