ప్రారంభమైన నీతి ఆయోగ్.. చర్చకు స్పెషల్ స్టేటస్..!

మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ భేటీ ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగుతున్న తొలి సమావేశం. రైతాంగ సంక్షోభం, కరవు, దేశ రక్షణ సమస్యలు, మావోయిస్టు ప్రాబల్యం ఎజెండాలో వంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. కాగా.. ఈ సమావేశానికి హాజరుకాని.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు అయితే.. […]

ప్రారంభమైన నీతి ఆయోగ్.. చర్చకు స్పెషల్ స్టేటస్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 15, 2019 | 4:39 PM

మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ భేటీ ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగుతున్న తొలి సమావేశం. రైతాంగ సంక్షోభం, కరవు, దేశ రక్షణ సమస్యలు, మావోయిస్టు ప్రాబల్యం ఎజెండాలో వంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. కాగా.. ఈ సమావేశానికి హాజరుకాని.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు

అయితే.. మరోవైపు ఏపీ నుంచి సీఎం జగన్, ఇతర అధికారులతో కలిసి సమావేశానికి హాజరయ్యారు. నీతి ఆయోగ్ వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మరోసారి ప్రస్తావించనున్నారు. మరి దీనిపై ప్రధాని మోదీ ఎలా స్పందించబోతారో తెలియాలి.