నేను నిందితురాలిని కాదు, నీరవ్ మోడీ కేసులో అప్రూవర్ గా మారుతున్న సోదరి పుర్వి మోడీ ,కోర్టు సమ్మతి

| Edited By: Anil kumar poka

Jan 06, 2021 | 1:21 PM

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో ఆయన సోదరి పుర్వి మోడీ అప్రూవర్ గా, లేదా ప్రాసిక్యూషన్ సాక్షిగా మారనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసులో నీరవ్ మోడీ,

నేను నిందితురాలిని కాదు, నీరవ్ మోడీ కేసులో అప్రూవర్ గా మారుతున్న సోదరి పుర్వి మోడీ ,కోర్టు సమ్మతి
Follow us on

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో ఆయన సోదరి పుర్వి మోడీ అప్రూవర్ గా, లేదా ప్రాసిక్యూషన్ సాక్షిగా మారనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసులో నీరవ్ మోడీ, ఆయన సమీప  బంధువు మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తనను అప్రూవర్ గా పరిగణించాలని పుర్వి మోడీ ముంబైలోని స్పెషల్ జడ్జి కోర్టును కోరారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారిస్తోంది. ఈ కేసులో తన పాత్ర పరిమితమేనని ఈడీ స్పష్టం చేసిందని, అందువల్ల తనను క్షమించి అప్రూవర్ లేక ప్రాసిక్యూషన్ సాక్షిగా పరిగణించాలని బెల్జియం వాసి అయిన పుర్వి అభ్యర్థించారు. పైగా  ఈ కేసు దర్యాప్తులో ఈడీకి అన్నివిధాలా సహకరించానన్నారు.   ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్న ఈ నిందితురాలు స్వయంగా కోర్టులో హాజరు కావాలని, ఇందుకు ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

నీరవ్ మోడీ. మెహుల్ చోక్సీ ఇద్దరూ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 14 వేల కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితులు. వీరిలో నీరవ్ ప్రస్తుతం లండన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
Also Read :అన్నకు తగ్గ తమ్ముడు, వజ్రాల వర్తకుడు నీరవ్ మోడీ సోదరుడిపై న్యూయార్క్ లో కేసు, 10 లక్షల డాలర్ల విలువైన వజ్రాలు ‘మాయం’ !
Also Read :కోట్లాది అంతర్ రాష్ట్ర కార్ ఫైనాన్సింగ్ స్కామ్, దిలీప్ చాబ్రియాతో బాటు ఆయన కుమారుడు, సోదరి కూడా నిందితులే, పోలీసులు.