కరోనా వైరస్ ‘రాక’ తో న్యూజిలాండ్ లో ఎన్నికలు వాయిదా

| Edited By: Anil kumar poka

Aug 17, 2020 | 1:14 PM

న్యూజిలాండ్ లో పూర్తిగా కనుమరుగైందనుకున్న కరోనా వైరస్ మళ్ళీ 'అడుగుపెట్టింది'. గత మంగళవారం ఆక్లాండ్ లో నలుగురు కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోకినట్టు మొదటిసారి కనుగొన్నారు.

కరోనా వైరస్ రాక తో న్యూజిలాండ్ లో ఎన్నికలు వాయిదా
Follow us on

న్యూజిలాండ్ లో పూర్తిగా కనుమరుగైందనుకున్న కరోనా వైరస్ మళ్ళీ ‘అడుగుపెట్టింది’. గత మంగళవారం ఆక్లాండ్ లో నలుగురు కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోకినట్టు మొదటిసారి కనుగొన్నారు. దీంతో దేశంలో ఎన్నికలను ప్రధాని జసిండా ఆర్డెర్న్ నాలుగు వారాల పాటు వాయిదా వేశారు. సెప్టెంబరు 19 నుంచి జరగవలసి ఉన్న ఎన్నికలను అక్టోబరు 17 కి వాయిదా వేశారు. సామాజిక వ్యాప్తి లేకుండా 102 రోజుల తరువాత..మళ్ళీ కోవిడ్ జాడ కనబడడం ఆందోళన కలిగిస్తోందని ఆమె చెప్పారు. ఎన్నికల కమిషన్ ని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అటు-ఈ ఔట్ బ్రేక్ కారణంగా అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి.

ఆక్లాండ్ లో గత మంగళవారం ఒకే కుటుంబంలోని నలుగురికి కరోనా వైరస్ సోకగా, ఆదివారం నాటికి ఇది 49 కేసులకు పెరిగింది.