మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై బీరు, విస్కీ హోమ్ డెలివరీ..

|

Feb 08, 2020 | 5:57 AM

New Plan By Alcohol Industry: నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి బట్టలు, ఫుడ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్.. ఇలా మరెన్నింటినో ‌ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదే కోవలో ఇకపై ఆల్కహాల్‌ను కూడా ఆన్‌లైన్ ద్వారా అమ్మాలని లిక్కర్ ఇండస్ట్రీ భావిస్తోంది. ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే మద్యాన్ని ఈ కామర్స్ సైట్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల ద్వారా విక్రయిస్తే రాబడి రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలు […]

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై బీరు, విస్కీ హోమ్ డెలివరీ..
Follow us on

New Plan By Alcohol Industry: నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి బట్టలు, ఫుడ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్.. ఇలా మరెన్నింటినో ‌ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదే కోవలో ఇకపై ఆల్కహాల్‌ను కూడా ఆన్‌లైన్ ద్వారా అమ్మాలని లిక్కర్ ఇండస్ట్రీ భావిస్తోంది.

ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే మద్యాన్ని ఈ కామర్స్ సైట్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల ద్వారా విక్రయిస్తే రాబడి రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలు ఈ విధానాన్ని తొందరగా అమలులోకి తీసుకురావాలని ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అమృత్ కిరణ్ సింగ్ ఆకాంక్షించారు.

ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిందని.. అయితే రిటైలర్ల సమస్యలను మాత్రం పూర్తిగా పరిష్కరించలేకపోయిందని అన్నారు. జీఎస్టీ పరిధిలో లేని.. ఆయా రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆల్కహాల్ విక్రయాలను ఆన్‌లైన్ ద్వారా చేస్తే లిక్కర్ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇకపై మందుబాబులు తమకు నచ్చిన బ్రాండ్‌ను ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు.