చైనా ఆక్రమణలు నిరాధారం, నేపాల్ క్లారిటీ

| Edited By: Pardhasaradhi Peri

Aug 23, 2020 | 4:39 PM

తమ భూభాగాలను చైనా ఆక్రమించుకుందన్న వార్తలను నేపాల్ ప్రభుత్వం ఖండించింది. ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం అండదండలతోనే చైనా ఆక్రమణలకు పాల్పడిందన్న సమాచారం సరికాదని..

చైనా ఆక్రమణలు నిరాధారం, నేపాల్ క్లారిటీ
Follow us on

తమ భూభాగాలను చైనా ఆక్రమించుకుందన్న వార్తలను నేపాల్ ప్రభుత్వం ఖండించింది. ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం అండదండలతోనే చైనా ఆక్రమణలకు పాల్పడిందన్న సమాచారం సరికాదని స్పష్టం చేసింది. నేపాల్ తో గల తమ సరిహద్దుల్లోని ఏడు జిల్లాల్లో చాలా ప్రాంతాలను  డ్రాగన్ కంట్రీ ఆక్రమించుకుందని గత జూన్ లోనే ఓ స్థానిక డైలీ వార్తను ప్రచురించిందని, అయితే అది వాస్తవం కాదని తాము చెప్పడంతో ఆ డైలీ క్షమాపణ కూడా చెప్పిందని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సంబంధిత వార్త నిరాధారమైనదని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని సర్వే విభాగం కూడా స్పష్టం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

మా ఉభయ దేశాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకుంటామని, ఇలాంటి సున్నితమై న అంశాలపై వార్తలు ప్రచురించేముందు సంబంధిత అధికారులను సంప్రదించాలని నేపాల్ సూచించింది.  పైగా ఈ   విధమైన  వదంతులు రెండు దేశాల మధ్య మైత్రీ సంబంధాలను దెబ్బ తీస్తాయని వాపోయింది.