రియా డ్రగ్స్ కేసు, సారా అలీఖాన్ ను విచారించనున్న ఎన్ సీ బీ

| Edited By: Ravi Kiran

Sep 17, 2020 | 5:42 PM

సుశాంత్ సింగ్ కేసు ఇప్పుడు రియాచక్రవర్తి డ్రగ్స్ కేసుగా మారినట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ పార్టీల్లో తనతో బాటు సారా అలీఖాన్, డిజైనర్ సైమోన్ ఖంబట్టా, సుశాంత్ మాజీ మేనేజర్ రోహిణీ అయ్యర్ కూడా డ్రగ్స్ సేవించేవారని..

రియా డ్రగ్స్ కేసు, సారా అలీఖాన్ ను విచారించనున్న ఎన్ సీ బీ
Follow us on

సుశాంత్ సింగ్ కేసు ఇప్పుడు రియాచక్రవర్తి డ్రగ్స్ కేసుగా మారినట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ పార్టీల్లో తనతో బాటు సారా అలీఖాన్, డిజైనర్ సైమోన్ ఖంబట్టా, సుశాంత్ మాజీ మేనేజర్ రోహిణీ అయ్యర్ కూడా డ్రగ్స్ సేవించేవారని ఆమె నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు తెలిపింది. ఫిల్మ్ మేకర్ ముకేశ్ చాబ్రా పేరును కూడా ఆమె ప్రస్తావించింది. కాగా- మొదట సారా అలీఖాన్ ను ఈ దర్యాప్తు సంస్థ త్వరలో విచారించనున్నట్టు తెలుస్తోంది. ఇదే  సమయంలో సుమారు 15 మంది బాలీవుడ్ సెలబ్రిటీలను ప్రశ్నించేందుకు ఎన్ సీ బీ లిస్ట్ తయారు చేస్తోందని అంటున్నారు. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ప్రస్తుతం జైల్లో ఉన్నారు.