ప్రియుడితో ప్రైవేట్ జెట్ లో నయన్

|

Aug 31, 2020 | 8:50 PM

దక్షిణాది లేడీ సూపర్‌స్టార్.. అందాలతార నయనతార ఒక స్ట్రాంగ్ లేడీ. అదే రీతిలో ఎంతోమందికి హెల్పింగ్ హ్యాండ్ కూడా ఇస్తుంది. అటు ప్రేమ విషయంలో..

ప్రియుడితో ప్రైవేట్ జెట్ లో నయన్
Follow us on

దక్షిణాది లేడీ సూపర్‌స్టార్.. అందాలతార నయనతార ఒక స్ట్రాంగ్ లేడీ. అదే రీతిలో ఎంతోమందికి హెల్పింగ్ హ్యాండ్ కూడా ఇస్తుంది. అటు ప్రేమ విషయంలో నూ నయన్ సూపర్ స్టారే. ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో కలిసి కేరళ పెద్దపండుగ ఓనం వేళ ప్రైవేటు జెట్ విమానంలో చెన్నై నుంచి కోచి వచ్చింది నయన్. ఇలా నయనతార కుటుంబ సభ్యులతో పాటు విఘ్నేశ్ కూడా ఓనం పండుగను జరుపుకోబోతున్నాడన్నమాట. కోచి విమానాశ్రయంలో వీరిద్దరూ నడిచి వెళుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు.