ఫేస్ బుక్ తో శశిథరూర్ ‘ముఖాముఖి’, మరోసారి జరగనున్న చర్చలు

| Edited By: Anil kumar poka

Sep 03, 2020 | 10:53 AM

బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫేస్ బుక్ రేపిన వ్యవహారం ఎటూ తేలలేదు. కమలనాథులు, ఇతర మితవాద బృందాల విద్వేష పూరిత ప్రసంగాలను ఫేస్ బుక్ కావాలనే పక్కన పెడుతోందని వాల్ స్ట్రీట్ పత్రికలో వఛ్చిన...

ఫేస్ బుక్ తో శశిథరూర్ ముఖాముఖి, మరోసారి జరగనున్న చర్చలు
Follow us on

బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫేస్ బుక్ రేపిన వ్యవహారం ఎటూ తేలలేదు. కమలనాథులు, ఇతర మితవాద బృందాల విద్వేష పూరిత ప్రసంగాలను ఫేస్ బుక్ కావాలనే పక్కన పెడుతోందని వాల్ స్ట్రీట్ పత్రికలో వఛ్చిన కథనాల నేపథ్యంలో ఫేస్ బుక్ ఇండియా చీఫ్ బుధవారం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చైర్మన్ గా గల పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఈ మీటింగ్ లో తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని ఫేస్ బుక్ ఇండియా చీఫ్ అజిత్ మోహన్ స్పష్టం చేశారు. అయితే అటు గ్లోబల్ స్టాండర్డ్ గా, ఇటు భారతీయ చట్టాల పరంగా మీ వైఖరి ఏమిటన్న కమిటీ  సభ్యుల ప్రశ్నకు ఆయన సరయిన సమాధానం చెప్పలేకపోయారు. తమ మధ్య చర్చలు మూడున్నరగంటలపాటు సాగాయని, అయితే మళ్ళీ సమావేశమవుతామని శశిథరూర్ ట్వీట్ చేశారు. ఈయనను కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ ఏకంగా స్పీకర్ కే లేఖ రాసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కామ్ అయిపోవడం విశేషం. ఆయనతో సహా ఇతర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కలివిడిగా మాట్లాడుకుని ‘సౌహార్ద్ర పూరిత వాతావరణం’లో సమావేశాన్ని ముగించారు.