బాప్ రే ! నీళ్ల లోనూ కరోనా వైరస్ !

| Edited By: Anil kumar poka

Apr 20, 2020 | 12:52 PM

ఇప్పటివరకు కరోనా వైరస్ మనుషులనే బాధిస్తుందని, ప్రాణాంతకమవుతుందని భావిస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మరో భయంకర విషయం బయటపడింది. నీటిలో కూడా కొత్త రకం కరోనా  వైరస్ ఆనవాళ్లను  కనుగొన్నారు.

బాప్ రే ! నీళ్ల లోనూ కరోనా వైరస్ !
Follow us on

ఇప్పటివరకు కరోనా వైరస్ మనుషులనే బాధిస్తుందని, ప్రాణాంతకమవుతుందని భావిస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మరో భయంకర విషయం బయటపడింది. నీటిలో కూడా కొత్త రకం కరోనా  వైరస్ ఆనవాళ్లను  కనుగొన్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో గల వాటర్ అథారిటీ లేబొరేటరీ సేకరించిన నీళ్లలో ఇది ఉన్నట్టు తెలిసింది. కానీ డ్రింకింగ్ వాటర్ లో కాదని, వీధులను శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలోనని తేలింది. ప్యారిస్ చుట్టుపక్కల గల ప్రాంతాల్లో 27 నీటి సాంపిల్స్ ను టెస్ట్ చేయగా వీటిలో నాలుగు సాంపిల్స్ లో ఈ కొత్త రకం వైరస్ ని కనుగొన్నట్టు నగర పర్యావరణ శాఖ అధికారి బ్లాల్ తెలిపారు. అయితే మంచి నీరు మాత్రం పూర్తిగా ఇండిపెండెంట్ నెట్ వర్క్ నుంచి సరఫరా అవుతుందని, ఎలాంటి రిస్క్ లేకుండా తాగవచ్ఛునని ఆయన చెప్పారు. సిటీకి దగ్గర లోని సీన్ నది నుంచి, మరో కాలువ నుంచి సేకరించిన నీటిని వీధులతో బాటు పార్కులు, గార్డెన్లను శుభ్రపరచడానికి వినియోగిస్తారు. (అంటే మన దేశంలోని వీటిని క్లీన్ చేసేందుకు మనం వాడే బోరింగ్ నీటివంటిదన్న మాట).. కానీ ఎందుకైనా మంచిదని పార్కులు, గార్డెన్లను మూసివేసినట్టు బ్లాల్ వెల్లడించారు. ఇక ఈ వైరస్ ననిరోధానికి ఏం చేయాలన్న దానిపై ప్రాంతీయ హెల్త్ ఏజన్సీని సంప్రదిస్తున్నట్టు ఆయన చెప్పారు.