జార్జ్ ఫ్లాయిడ్ మృతి.. మినియాపొలీస్ శాఖకు స్వస్తి.. సంచలన నిర్ణయం

| Edited By: Pardhasaradhi Peri

Jun 08, 2020 | 10:41 AM

అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతి నేపథ్యంలో మినియాపొలీస్ విభాగాన్ని 'భూస్థాపితం' చేయనున్నారు. అంటే ఇక్కడి ఈ శాఖను పూర్తిగా ఎత్తివేసి.. 

జార్జ్ ఫ్లాయిడ్ మృతి.. మినియాపొలీస్ శాఖకు స్వస్తి.. సంచలన నిర్ణయం
Follow us on

అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతి నేపథ్యంలో మినియాపొలీస్ విభాగాన్ని ‘భూస్థాపితం’ చేయనున్నారు. అంటే ఇక్కడి ఈ శాఖను పూర్తిగా ఎత్తివేసి..  నల్లజాతీయులతో  కూడిన పోలీసు డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేయనున్నారు. మినియాపొలీస్ కౌన్సిల్ చైర్మన్ లీసా బెండర్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.  జార్జి ఫ్లాయిడ్ హత్యతో సుమారు రెండు వారాల పాటు అమెరికా అంతటా నిరసనలు, అల్లర్లు, ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులు ఏకంగా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ముట్టడికే సిధ్ధమయ్యారు. అక్కడ పోలీసులకు, వారికి మధ్య జరిగిన ఘర్షణలో అనేకమంది గాయపడ్డారు కూడా. ఇంత అప్రదిష్టను మూటగట్టుకున్న మినియాపొలీస్ విభాగాన్ని మొత్తం రద్దు చేసి నల్లజాతీయులతోనే కొత్త పోలీసు డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేయాలని  నగర  కౌన్సిల్ నిర్ణయించింది. కౌన్సిల్ లోని సభ్యులంతా ఈ ప్రతిపాదనను ఆమోదించారని   లీసా బెండర్ వెల్లడించారు. ప్రస్తుతమున్న పోలీసు శాఖ పని చేయలేక చేతులెత్తేసిందన్నారు. ఈ కారణంగా ఈ పోలీసింగ్ సిస్టం కి స్వస్తి చెబుతున్నామన్నారు. ఏమైనా…. జార్జి ఉదంతం యుఎస్ లో కొత్త పోకడలకు దారి తీస్తోంది.