Melania Trump In School:’పిల్లలూ ? బాగా చదువుతున్నారా ‘? ఢిల్లీ స్కూల్లో ఫస్ట్ లేడీ మెలనియా

|

Feb 25, 2020 | 6:36 PM

అమెరికా ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ మంగళవారం ఢిల్లీ.. నానక్ పురలోని సర్వోదయ కో-ఎడ్ సీనియర్ సెకండరీ స్కూలును సందర్శించారు. 'హ్యాపీనెస్ క్లాస్' పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు

Melania Trump In School:పిల్లలూ ? బాగా చదువుతున్నారా ? ఢిల్లీ స్కూల్లో ఫస్ట్ లేడీ మెలనియా
Follow us on

అమెరికా ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ మంగళవారం ఢిల్లీ.. నానక్‌పురలోని సర్వోదయ కో-ఎడ్ సీనియర్ సెకండరీ స్కూలును సందర్శించారు. ‘హ్యాపీనెస్ క్లాస్’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ఒక విద్యార్థిని ఆమె నుదుటిపై తిలకం దిద్దింది. కొద్దిసేపు ఈ పాఠశాలలో గడిపిన మెలనియా.. విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.

వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. కొందరు  పిల్లల బుడిబుడి నడకలు, వారి మాటలకు ఈ ఫస్ట్ లేడీ ఫిదా అయ్యారు. తన ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలకు ఆమె ముచ్చట పడ్డారు. తన ప్రశ్నలను వారు అర్థం చేసుకున్నా,రో లేదో తెలియకపోయినా.. వారిఛ్చిన జవాబులు తనకు అర్థం కాకపోయినా.. వారి హావభావాలు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు వేసిన పెయింటింగులను ఆమె ఆసక్తిగా చూశారు. ఆ పిల్లల మధ్య తానూ ఓ విద్యార్థిగా మారిపోయి.. వారితో ఎంజాయ్ చేశారు. ఈ భారత పర్యటన తన జీవితంలో మరపురానిదని ఆమె ఆ తరువాత పేర్కొన్నారు.