వెటర్నరీ మెడిసిన్ లో ‘కుక్క గారికి డాక్టరేట్’

| Edited By: Pardhasaradhi Peri

May 19, 2020 | 4:22 PM

ఒక కుక్కకు గౌరవప్రద డాక్టరేట్ పట్టా ఇఛ్చారంటే ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే ! ఎవరూ ఊహించని వింత విషయమిది ! కానీ కొన్ని విషయాలు నమ్మి తీరాలి.. అమెరికాలోని వర్జీనియా టెక్ యూనివర్సిటీ తమ ‘స్టాఫ్’ లో ఒకటిగా భావిస్తున్న ‘మూస్ డెవిస్’ అనే శునకానికి వెటర్నరీ మెడిసిన్ లో డాక్టరేట్ పట్టా ప్రదానం చేసి’ గౌరవించింది’. ఇటీవల గ్రాడ్యుయేషన్ సెరిమనీలో జరిగిన  ఈ ‘అపూర్వ ఘటన’ గురించి ఆన్ లైన్ ద్వారా వెల్లడించింది. వర్సిటీ విద్యార్థులకు, […]

వెటర్నరీ మెడిసిన్ లో కుక్క గారికి డాక్టరేట్
Follow us on

ఒక కుక్కకు గౌరవప్రద డాక్టరేట్ పట్టా ఇఛ్చారంటే ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే ! ఎవరూ ఊహించని వింత విషయమిది ! కానీ కొన్ని విషయాలు నమ్మి తీరాలి.. అమెరికాలోని వర్జీనియా టెక్ యూనివర్సిటీ తమ ‘స్టాఫ్’ లో ఒకటిగా భావిస్తున్న ‘మూస్ డెవిస్’ అనే శునకానికి వెటర్నరీ మెడిసిన్ లో డాక్టరేట్ పట్టా ప్రదానం చేసి’ గౌరవించింది’. ఇటీవల గ్రాడ్యుయేషన్ సెరిమనీలో జరిగిన  ఈ ‘అపూర్వ ఘటన’ గురించి ఆన్ లైన్ ద్వారా వెల్లడించింది. వర్సిటీ విద్యార్థులకు, సిబ్బందికి సేవ చేస్తూ తన కెరీర్ ను గడిపిన ఈ ఆరేళ్ళ శునకం కృషిని గుర్తిస్తున్నామని యూనివర్సిటీ వెల్లడించింది. లాబ్రడార్ జాతికి చెందిన ఈ కుక్క 2014 నుంచి ఈ విశ్వవిద్యాలయంలోని ‘కుక్ కౌన్సెలింగ్ సెంటర్’ లో ఉంటోంది. ఈ వర్సిటీలో ఎనిమల్ అసిస్టెడ్ థెరపీ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, కౌన్సెలర్ కూడా అయిన ట్రెంట్ డెవిస్ దీని యజమాని. తన శారీరక అనారోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా ఈ శునకం ఎప్పుడూ చలాకీగా ఉంటుందని, విద్యార్థులను, స్టాఫ్ ను సంతోషంగా ఉంచుతుందని ఆయన చెబుతున్నారు. యేవో కారణాలతో, డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకునే స్టూడెంట్స్ కో, లేదా సిబ్బందికో వారిని ఆ ఆలోచన నుంచి తప్పించడానికి నిర్వహించే కౌన్సెలింగ్ సెషన్స్ లో ఈ కుక్క కూడా పాల్గొందట. అలా ఇప్పటివరకు నిర్వహించిన 7,500 కౌన్సెలింగ్ సెషన్స్ లో మూస్ పార్టిసిపేట్ చేసిందని, అలాగే… ఇలాంటి 500 ఔట్ రీచ్ ఈవెంట్లకు కూడా హాజరయిందని ట్రెంట్ తెలిపారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ శునకానికి ప్రోస్టేట్ క్యాన్సర్ సోకిందని, రేడియేషన్, ఖేమోథెరపీ చికిత్సలు కూడా చేయించుకుందని ఆయన విచారంగా చెప్పారు. అయినా ఏ పనీ లేనప్పుడు ఈ శునకం స్విమ్మింగ్ చేస్తూ, టగ్ ఆఫ్ వార్ ఆట ఆడుతూ అసలు తనలో ఏ అనారోగ్యమూ లేనట్టే కనిపిస్తుందన్నారు.