ఎంపీలంతా విధిగా మాస్కులు ధరించాల్సిందే ! వెంకయ్యనాయుడు

| Edited By: Pardhasaradhi Peri

Sep 16, 2020 | 4:40 PM

ఎంపీలంతా సభలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. ఏసీతో కూడిన హాలు గనుక సభ్యులంతా విధిగా వీటిని ధరించి ఉండాలన్నారు. మాట్లాడుతున్నప్పడు తనకు..

ఎంపీలంతా విధిగా మాస్కులు ధరించాల్సిందే ! వెంకయ్యనాయుడు
Follow us on

ఎంపీలంతా సభలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. ఏసీతో కూడిన హాలు గనుక సభ్యులంతా విధిగా వీటిని ధరించి ఉండాలన్నారు. మాట్లాడుతున్నప్పడు తనకు సరిగాశ్వాస ఆడక ఇబ్బందిగా ఉందని, అందువల్ల మాస్క్ తీసివేసేందుకు తనను అనుమతించాలని సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ కోరినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. మాస్క్ ధరించి చాలాసేపు కూర్చోవడం, మాట్లాడేటప్పుడు ఇబ్బంది ఎదురవడం గురించి తాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డీజీతో మాట్లాడానని, కానీ మాస్కులు ఉండి తీరాల్సిందేనని ఆయన ఖఛ్చితంగా చెప్పారని వెంకయ్యనాయుడు తెలిపారు, లోక్ సభ ఎంపీల్లో 17 మంది, రాజ్యసభ సభ్యుల్లో 8 మంది కరోనా ఇన్ఫెక్షన్ కి గురైన సంగతి విదితమే.