టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై హత్యా యత్నం చేసిన వ్యక్తి అరెస్ట్ ?

| Edited By: Pardhasaradhi Peri

Oct 28, 2020 | 4:00 PM

ముంబైలో టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై కత్తితో దాడి చేసి పారిపోయిన యోగేష్ కుమార్ మహీపాల్ సింగ్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. తనను పెళ్లి చేసుకోవాలన్న అతని రిక్వెస్టును మాల్వీ నిరాకరించడంతో ఆమె పై  యోగేష్ కత్తితో ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ దాడిలో ఆమె చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.  అటు -అతని జాడ కనుగొన్నామని, మరి కొద్ది గంటల్లో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఏదో అస్వస్థతతో పాల్ఘర్ లోని ఓ […]

టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై హత్యా యత్నం చేసిన వ్యక్తి అరెస్ట్ ?
Follow us on

ముంబైలో టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై కత్తితో దాడి చేసి పారిపోయిన యోగేష్ కుమార్ మహీపాల్ సింగ్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. తనను పెళ్లి చేసుకోవాలన్న అతని రిక్వెస్టును మాల్వీ నిరాకరించడంతో ఆమె పై  యోగేష్ కత్తితో ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ దాడిలో ఆమె చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.  అటు -అతని జాడ కనుగొన్నామని, మరి కొద్ది గంటల్లో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఏదో అస్వస్థతతో పాల్ఘర్ లోని ఓ ఆసుపత్రిలో అతడు చేరినట్టు తెలుసుకున్నామని వారు చెప్పారు.  మహిళను వేధించాడన్న ఆరోపణ పైన, హత్యాయత్నానికి పాల్పడ్డాడన్న అభియోగంపైన వారు అతనిపై కేసు పెట్టారు. కాగా- ఇలాంటి వ్యక్తుల బారి నుంచి తనను కాపాడాలని, తనకు సపోర్టు ఇవ్వాలని మాల్వీ మల్హోత్రా… బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ని, జాతీయ మహిళా కమిషన్ ను కోరుతూ ట్వీట్లు చేసింది.