నిగనిగలాడే జట్టున్నవారిని చూసి ఓర్వలేడు!

|

Oct 23, 2020 | 3:36 PM

నల్లగా నిగనిగలాడే జుట్టుంటే అతగాడు ఓర్వలేడు! ఎందుకో తెలియదు కానీ అలా పెద్దగా జట్టు పెంచుకునేవాళ్లంటే ఈర్ష్యాసూయలు! అలా జుట్టు పెంచుకున్న వారికి ఫోన్‌లు చేసి తానో పోలీసునని, అంతేసి జుట్టుంటే కేసు పెడతానని బెదిరించడం అలవాటు చేసుకున్నాడు..

నిగనిగలాడే జట్టున్నవారిని చూసి  ఓర్వలేడు!
Follow us on

నల్లగా నిగనిగలాడే జుట్టుంటే అతగాడు ఓర్వలేడు! ఎందుకో తెలియదు కానీ అలా పెద్దగా జట్టు పెంచుకునేవాళ్లంటే ఈర్ష్యాసూయలు! అలా జుట్టు పెంచుకున్న వారికి ఫోన్‌లు చేసి తానో పోలీసునని, అంతేసి జుట్టుంటే కేసు పెడతానని బెదిరించడం అలవాటు చేసుకున్నాడు.. పాపం ఇతడి ఆటలు ఎక్కువ రోజులు సాగలేదు. పోలీసులు ఆ ఫేక్‌ కాల్స్‌ చేస్తున్నవాడిని పట్టుకుని అరెస్ట్‌ చేశారు. ఈ పాడుబుద్ధి ఉన్న వ్యక్తి పేరు మచుకూరి పండారి.. ఉండేది సంగారెడ్డి.. ఈ పండారి ఏం చేశాడంటే.. అనకాపల్లి భీముని గుమ్మం ప్రాంతానికి చెందిన మణికుమార్‌కు ఫోన్‌ చేసి తానో సీఐనని చెప్పుకున్నాడు.. అర్జెంటుగా జుట్టు కత్తిరించుకోవాలని ఫోన్‌లోనే ఆర్డరేశాడు.. అడగాడి బెదిరింపులకు బెదిరిపోయిన మణికుమార్‌ జుట్టును కత్తిరించుకున్నాడు.. చెప్పినట్టే చేశాడనని ఊరుకోవాలి కదా! పండారి ఊరుకోలేదు.. గుండు చేయించుకోకపోతే సైబర్‌ క్రైమ్‌ నేరం కింద కేసు పెడతానని మణికుమార్‌ను వేధించసాగాడు.. వీడెవడో తింగరిగాడల్లే ఉన్నాడని అనుకున్న మణికుమార్‌ బంధువులు అనకాపల్లి పోలీసుల దగ్గరకు వెళ్లి విషయం చెప్పుకున్నారు.. పోలీసులు దర్యాప్తు చేస్తే పండారి విషయం తెలిసింది.. ఇట్టాగే తెలుగు రాష్ట్రాలలో చాలా మంది యువకులను బెదిరించాడట! సోషల్‌ మీడియాలలో ఫోటోలు చూసి ఎక్కువ జట్టున్నవారికి ఫోన్‌ చేసి బెదిరించడం పండారి అలవాటని తెలుసుకున్నారు పోలీసులు.. గతంలో కూడా ఇతనిపై చాలా కేసులున్నాయని పోలీసులు అంటున్నారు.. ఇలాంటి ఫేక్‌ కాల్స్‌కి ఎవరూ భయపడకూదని ప్రజలకు సూచిస్తున్నారు..