జోడి కోసం అమ్ముడవ్వడానికి సిద్ధపడ్డ వ్యక్తి

|

Oct 03, 2020 | 10:05 AM

బ్రిటన్‌లోని నార్తాంప్టన్‌షైర్‌లో ఉన్న అలెన్‌ క్లేటన్‌కు వచ్చిన కష్టాలు పగవాడిక్కి కూడా రావద్దు.. పాపం.. బ్రహ్మచారి జీవితానికి స్వస్తి పలికేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు కానీ వర్కవుటవ్వడం లేదు.. చివరాఖరికి తనకు తానే అమ్ముకోవాలనే స్టేజ్‌కి వచ్చాడు..

జోడి కోసం అమ్ముడవ్వడానికి సిద్ధపడ్డ వ్యక్తి
Follow us on

బ్రిటన్‌లోని నార్తాంప్టన్‌షైర్‌లో ఉన్న అలెన్‌ క్లేటన్‌కు వచ్చిన కష్టాలు పగవాడిక్కి కూడా రావద్దు.. పాపం.. బ్రహ్మచారి జీవితానికి స్వస్తి పలికేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు కానీ వర్కవుటవ్వడం లేదు.. చివరాఖరికి తనకు తానే అమ్ముకోవాలనే స్టేజ్‌కి వచ్చాడు.. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న అలెన్‌ పదేళ్లుగా ఓ ప్రియురాలి కోసం అన్వేషిస్తున్నాడు.. అందుకోసం నానా ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఏదీ ఫలించడం లేదు.. సోషల్‌ మీడియా హెల్ప్‌ కూడా తీసుకున్నాడు.. కళ్లు, చేతులు నొప్పుట్టే వరకు డేటింగ్‌ యాప్‌లు వెతికాడు.. ఒక్కరంటే ఒక్క అమ్మాయి కూడా అలెన్‌ కోసం ముందుకు రాలేదు.. ఇలాగైతే లాభం లేదనుకున్న అలెన్‌ చివరాఖరిగా ఓ గట్టి ప్రయత్నం చేద్దామని డిసైడయ్యాడు.. అదేమిటంటే తనను తాను అమ్ముకోవడం.. ఫేస్‌బుక్‌ క్లాసిఫైడ్‌లో అడ్వర్‌టైజ్‌మెంట్‌ కూడా ఇచ్చుకున్నాడు.. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు తనను కొనుక్కోవచ్చని అందులో అభ్యర్థించాడు.. తన పేరు అలెన్‌ అని, 30 ఏళ్ల వయసు ఉంటుందని, అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నానని అందులో చెప్పుకున్నాడు.. పార్టీలకు, ఫంక్షన్లకు ఒంటరిగా వెళ్లాలంటే బోర్‌ కొట్టేస్తుందని, జంటగా వెళ్లే అదృష్టాన్ని ప్రసాదించాలని వేడుకున్నాడు.. అయినా ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఓకే చెప్పలేదు.. తన ప్రకటనపై బోలెడన్ని నమ్మకాలు పెట్టుకున్నాడు అలెన్‌.. ఇవాళ కాకపోయినా రేపోమాపో ఎవరో ఒకరు తనను ఇష్టపడతారనే విశ్వాసంతో ఉన్నాడు.. అలెన్‌ తండ్రి ఫ్రాంక్‌ కూడా కొడుకు చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా నిలిచాడు.. ‘నా కొడుకని చెప్పడం లేదుకానీ.. వాడు బంగారం.. ఏం చేయమన్నా చేస్తాడు.. వంటలు రుచికరంగా చేస్తాడు.. అంట్లు కూడా తోముతాడు.. అంచేత అమ్మాయిలు ప్రొసీడ్‌ కావచ్చు’ అని అంటున్నాడు.. పోనీ ఈ తండ్రి మాటలు వినైనా అమ్మాయిలు ముందుకొస్తారా లేదా చూడాలి..!