పాక్ జెండాను ఇంటిపై ఎగురవేసిన వ్యక్తి అరెస్ట్

|

Aug 31, 2020 | 3:28 PM

తన ఇంటిపై పాకిస్తాన్ జెండా ఎగురవేసిన మధ్య ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని దేవాస్ జిల్లాలోని షిప్రా గ్రామానికి చెందిన ఫారుక్ ఖాన్‌గా అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

పాక్ జెండాను ఇంటిపై ఎగురవేసిన వ్యక్తి అరెస్ట్
Follow us on

తన ఇంటిపై పాకిస్తాన్ జెండా ఎగురవేసిన మధ్య ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని దేవాస్ జిల్లాలోని షిప్రా గ్రామానికి చెందిన ఫారుక్ ఖాన్‌గా అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సామాజిక సామరస్యతకు విఘాతం కలిగిస్తున్నాడని ఆరోపిస్తూ ఖాన్‌పై కేసు నమోదైంది.అతడు దాయాది శత్రు దేశం పాకిస్తాన్ జాతీయ జెండాను తన ఇంటిపై ఎగురవేశాడు. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదీకాస్త వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఇంట్లో నుంచి పాకిస్తాన్ జెండాను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

కాగా, 12 ఏళ్ల తన కుమారుడు తెలిసీతెలియకుండా ఇంటిపై పాకిస్తాన్ జెండా ఎగురవేశాడంటూ సదరు ఇంటి యజమాని పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు. ఈ విషయం తనకు తెలియగానే జెండాను తొలగించినట్టు అతడు చెప్పాడని తెలిపారు. అయితే, పాకిస్తాన్ జెండా ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై అతడు సమాధానం చెప్పలేకపోయాడని ఎస్పీ కిరణ్ శర్మ పేర్కొన్నారు. ఫారూక్ ఖాన్ కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాల కోసం విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.