లవ్ జిహాద్ సామాజిక దురాచారం, కర్నాటక హోం మంత్రి

| Edited By: Pardhasaradhi Peri

Nov 05, 2020 | 3:25 PM

లవ్ జిహాద్ సామాజిక దురాచారమని, దీన్ని నిషేధించేందుకు చట్టం అవసరమని కర్నాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. ఇదే విషయమై అన్ని రాష్ట్రాల్లోనూ సమాజం లోని వివిధ వర్గాలు యోచిస్తున్నాయన్నారు. దీనిపై తమ ప్రభుత్వం కూడా నిపుణులతో చర్చిస్తోందన్నారు. కొంతకాలంగా ఈ దురాచారం సాగుతోంది.. దీన్ని నివారించడానికి చట్టమంటూ ఒకటుండాలి.. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ దిశగా ఆలోచిస్తున్నాయి అని బొమ్మై తెలిపారు. యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ విధమైన చట్టాలపై […]

లవ్ జిహాద్ సామాజిక దురాచారం, కర్నాటక హోం మంత్రి
Follow us on

లవ్ జిహాద్ సామాజిక దురాచారమని, దీన్ని నిషేధించేందుకు చట్టం అవసరమని కర్నాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. ఇదే విషయమై అన్ని రాష్ట్రాల్లోనూ సమాజం లోని వివిధ వర్గాలు యోచిస్తున్నాయన్నారు. దీనిపై తమ ప్రభుత్వం కూడా నిపుణులతో చర్చిస్తోందన్నారు. కొంతకాలంగా ఈ దురాచారం సాగుతోంది.. దీన్ని నివారించడానికి చట్టమంటూ ఒకటుండాలి.. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ దిశగా ఆలోచిస్తున్నాయి అని బొమ్మై తెలిపారు. యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ విధమైన చట్టాలపై దృష్టి పెట్టాయని, లవ్ జిహాద్ పేరిట బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీ ఒకరు ఈ సందర్భంగా చేసిన ట్వీట్ ను ఆయన గుర్తు చేశారు. నిపుణలతో సంప్రదించిన అనంతరం తమ ప్రభుత్వం కూడా చట్టం తెచ్ఛే సూచనలున్నాయని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.