విశాఖ ఘటన..గ్యాస్ లీక్ ని అదుపు చేశాం.. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం.. కొరియా కంపెనీ

| Edited By: Pardhasaradhi Peri

May 07, 2020 | 4:49 PM

విశాఖపట్నం లోని తమ ప్లాంట్ లో స్టెరిన్ గ్యాస్ లీక్ ని అదుపు చేశామని దక్షిణ కొరియా (సియోల్) లోని ఎల్.జీ.ఖేమ్ తెలిపారు. ఈ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన ఎల్.జీ.పాలిమర్స్ సంస్థకు ఈయన యజమాని కూడా. ఈ ఘటనపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామన్నారు. గ్యాస్ లీక్ సంఘటనలో 11 మంది మృతి చెందారని, అనేకమంది అస్వస్థులయ్యారని తమకు పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. తమ ప్లాంట్ సమీపంలో నివసిస్తున్నవారికి ఎంత నష్టం కలిగిందన్న దానిపై తాము అంచనా వేస్తున్నామని, సంబంధిత […]

విశాఖ ఘటన..గ్యాస్ లీక్ ని అదుపు చేశాం.. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం.. కొరియా కంపెనీ
Follow us on

విశాఖపట్నం లోని తమ ప్లాంట్ లో స్టెరిన్ గ్యాస్ లీక్ ని అదుపు చేశామని దక్షిణ కొరియా (సియోల్) లోని ఎల్.జీ.ఖేమ్ తెలిపారు. ఈ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన ఎల్.జీ.పాలిమర్స్ సంస్థకు ఈయన యజమాని కూడా. ఈ ఘటనపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామన్నారు. గ్యాస్ లీక్ సంఘటనలో 11 మంది మృతి చెందారని, అనేకమంది అస్వస్థులయ్యారని తమకు పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. తమ ప్లాంట్ సమీపంలో నివసిస్తున్నవారికి ఎంత నష్టం కలిగిందన్న దానిపై తాము అంచనా వేస్తున్నామని, సంబంధిత సంస్థల ద్వారా వారిని, తమ కంపెనీ సిబ్బందిని రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని ఖేమ్ చెప్పారు. అసలు ఈ లీక్ ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామని, ఈ గ్యాస్ పీలిస్తే..శ్వాస తీసుకోలేకపోతారని, డిజ్జీనెస్ వస్తుందన్నారు.

కాగా నైట్ షిఫ్ట్ లో ఉన్న ఓ కార్మికుడు ఒక  ట్యాంక్ నుంచి లీక్ అవుతున్న గ్యాస్ ను గుర్తించాడని సియోల్ లోని ఈ కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. కరోనా వైరస్ లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ఈ ప్లాంట్ ను మూసివేశామని, అయితే ఆంక్షల సడలింపుతో మళ్ళీ ఇందులో రోజువారీ కార్యకలాపాలను పునరుధ్ధరించే యోచనలో ఉండగా ఈ ఘటన జరిగిందని ఆయన పేర్కొన్నాడు.

తాజా ఘటన నేపథ్యంలో…. సౌత్ కొరియాలో టాప్ పెట్రో కెమికల్ మేకర్ అయిన ఎల్.జీ ఖేమ్ షేర్లు 1.94 శాతం పడిపోయాయి. ఈ కంపెనీ జనరల్ మోటార్స్ కి, వోక్స్ వ్యాగన్, ఇతర సంస్థలకు ఎలెక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలను సప్లయ్ చేస్తుంటుంది. హిందూస్తాన్ పాలిమర్స్ ను టేకోవర్ చేసిన ఎల్.జీ.ఖేమ్.. దానినే 1997 లో ఎల్.జీ.పాలిమర్స్ ఇండియా  అని పేరు మార్చినట్టు తెలుస్తోంది.