KVP letter to Modi: మోదీకి కేవీపీ లేఖ… మ్యాటరేంటంటే?

|

Mar 13, 2020 | 3:29 PM

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖాస్త్రం సంధించారు. కరోనా ఎఫెక్టుపై కేంద్రం ఎలాంటి చర్యలను తక్షణం తీసుకోవాలో కేవీపీ తన లేఖలో మోదీకి వివరించారు. ప్రాధాన్య రంగాలను విస్మరించొద్దని ఆయన సూచించారు.

KVP letter to Modi: మోదీకి కేవీపీ లేఖ... మ్యాటరేంటంటే?
Follow us on

Outgoing Rajyasabha member KVP Ramchandrarao writes letter to Prime Minister Modi: మరికొన్ని రోజుల్లో పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రధానమంత్రి నరేంద్రం మోదీకి లేఖ రాశారు. దేశమంతా కరోనా వైరస్ వ్యాప్తిపై భయాందోళనలో వుంటే కేవీపీ లేఖ మోదీకి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. శుక్రవారం తాను ప్రధాన మంత్రి మోదీకి రాసిన లేఖను కేవీపీ రామచంద్రరావు తెలుగు మీడియాకు విడుదల చేశారు.

దేశమంతా కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల పౌల్ట్రీ రంగం దారుణంగా దెబ్బతిన్నదని కేవీపీ తన లేఖ ద్వారా మోదీకి నివేదన పంపారు. పౌల్ట్రీ రైతులు, పరిశ్రమల కోసం భారత ప్రభుత్వం తరపున అత్యవసర ఆర్థిక సహాయం చేయాలని తన లేఖలో కేవీపీ రామచంద్రరావు ప్రధాన మంత్రిని కోరారు. ప్రస్తుతం పౌల్ట్రీ రైతులకు ప్రతికూల పరిణామాలతో భారీ సంక్షోభాన్ని సృష్టించాయని, కరోనా వైరస్‌పై వచ్చిన వదంతులు, వార్తలు, కథనాలు పౌల్ట్రీ రంగాన్ని దారుణంగా దివాలా తీసేలాగా చేశాయని ఆయన పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ వలన కోళ్ల ఉత్పత్తుల డిమాండ్ కూడా తగ్గిపోయిందని, ఆర్థిక సహాయం, ఇతర సదుపాయాలతో కేంద్రం తక్షణం ముందుకు రావాలని కేవీపీ తన లేఖ ద్వారా మోదీకి విఙ్ఞప్తి చేశారు.