నలబై ఏళ్ల సర్వీస్ లో బ్రాహ్మణులకు సేవ చేసే ఛాన్స్ రాలేదు

|

Sep 14, 2020 | 2:21 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి కీలకవ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తన నలభై ఏళ్ల సర్వీస్ లో బ్రాహ్మణులకు సేవ చేసే..

నలబై ఏళ్ల సర్వీస్ లో బ్రాహ్మణులకు సేవ చేసే ఛాన్స్ రాలేదు
Follow us on

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి కీలకవ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తన నలభై ఏళ్ల సర్వీస్ లో బ్రాహ్మణులకు సేవ చేసే అవకాశమే రాలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బ్రాహ్మణ పరిషత్ ద్వారా నిరుపేద బ్రహ్మణులకు సేవ చేసే అవకాశం లభించిందని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణ మహిళలకు… బ్రాహ్మణ సేవ వాహిని అండగా నిలిచిందని తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ బొగ్గుల కుంట లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో వంద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను రమణాచారీ పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాలు ప్రారంభమయ్యాయని… కానీ పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులు మాత్రం ఉపాధి లేకుండా ఉన్నారని రమణాచారి ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారిని గుర్తించి ఇప్పటి వరకు15 వేల మంది నిరు పేద బ్రాహ్మణులకు సేవ చేస్తున్న ‘సేవావాహిని’ నిర్వాహకులను ఆయన అభినందించారు. బ్రాహ్మణ పరిషత్ నుండి వచ్చే సబ్సిడీలను ఉపయోగించుకొని… మహిళలు సొంతంగా వ్యాపారాలను ప్రారంభించి అభివృద్ధి చెందాలని వేణుగోపాలచారి సూచించారు.