కోవిడ్ రూల్స్ బేఖాతర్ ! చెన్నైలో పోటెత్తిన కుమరన్ సిల్క్స్ షాప్, సీల్ !

| Edited By: Pardhasaradhi Peri

Oct 20, 2020 | 5:02 PM

చెన్నైలోని టీ.నగర్ లో కుమరన్ సిల్క్ షాప్ కస్టమర్లతో పోటెత్తింది. దసరా పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా ఈ షాపింగ్ మాల్ కి వచ్చిన వినియోగదారులతో ఇది కిక్కిరిసిపోయింది. కోవిడ్ నేపథ్యంలో ఎవరూ అసలు మాస్కులు ధరించనే లేకపోగా భౌతిక దూరం ఊసే లేదు. ఈ దృశ్యం తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, కరోనా వైరస్ గైడ్ లైన్స్ పాటించనందుకు  ఈ షాపును మున్సిపల్ అధికారులు సీల్ చేసేశారు. తమిళనాడులో కరోనా […]

కోవిడ్ రూల్స్ బేఖాతర్ ! చెన్నైలో పోటెత్తిన కుమరన్ సిల్క్స్ షాప్, సీల్ !
Follow us on

చెన్నైలోని టీ.నగర్ లో కుమరన్ సిల్క్ షాప్ కస్టమర్లతో పోటెత్తింది. దసరా పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా ఈ షాపింగ్ మాల్ కి వచ్చిన వినియోగదారులతో ఇది కిక్కిరిసిపోయింది. కోవిడ్ నేపథ్యంలో ఎవరూ అసలు మాస్కులు ధరించనే లేకపోగా భౌతిక దూరం ఊసే లేదు. ఈ దృశ్యం తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, కరోనా వైరస్ గైడ్ లైన్స్ పాటించనందుకు  ఈ షాపును మున్సిపల్ అధికారులు సీల్ చేసేశారు. తమిళనాడులో కరోనా వైరస్ కేసులు 7 లక్షలకు చేరుకున్నాయి. ఇప్పటివరకు సుమారు 11 వేళా మంది రోగులు మృతి చెందారు. ఒక్క చెన్నై నగరంలోనే రెండు లక్షలవరకు కేసులు నమోదయ్యాయి.