కృష్ణమ్మ ఉగ్రరూపం.. ప్రకాశం బ్యారేజీ దిగువన హై అలర్ట్

కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. భారీగా వరదనీరు విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి చేరుతుండటంతో 70గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 9లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముండటంతో లంక గ్రామాలు, పల్లపు ప్రాంతాల వాసుల్ని ఖాళీ చేయించారు.

కృష్ణమ్మ ఉగ్రరూపం.. ప్రకాశం బ్యారేజీ దిగువన హై అలర్ట్
Follow us

|

Updated on: Oct 18, 2020 | 5:09 PM

Krishna Flood Water : కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. భారీగా వరదనీరు విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి చేరుతుండటంతో 70గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 9లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముండటంతో లంక గ్రామాలు, పల్లపు ప్రాంతాల వాసుల్ని ఖాళీ చేయించారు.

వరద ముంపుకు గురవకుండా వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 1736 కుటుంబాలకు చెందిన 5, 025 నున్నవి పునరావాస కేంద్రాలకు తరలించారు. కాలువలకు 3,472 క్యూసెక్కుల నీటి విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర ఔట్ ఫ్లో 7,71,551 క్యూసెక్కులు…..ఇన్ ఫ్లో 7,65,023 క్యూసెక్కులు ఉంది.

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు కారణమైన తీవ్ర వాయుగుండం ప్రభావం కొంత బీమా పరీవాహక ప్రాంతానికి చేరిందని చెబుతున్నారు. కృష్ణానదిపై చిట్టచివర ఉన్న ప్రకాశం బ్యారేజీకి ఏ క్షణాన్నైనా 9 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని, అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే విజయవాడలోని రాణిగారి తోట, తారకరామ నగర్‌, రణ్‌దేవ్‌నగర్‌తో పాటు బ్యారేజ్ దిగువన, కరకట్ట ప్రాంతంలో ఉన్న వారిని ఖాళీ చేయించారు.

బ్యారేజి ముంపు ప్రాంతాల్లోకి వరదనీరు భారీగా చేరడంతో ఇళ్లలోకి పూర్తిగా నీళ్లు చేరాయి. పీకల్లోతు నీళ్లు చేరడంతో అక్కడి వారంతా ఇళ్లు ఖాళీ చేయక తప్పలేదు. విజయవాడలోని రణదేవ్‌నగర్‌, తారక్‌ రాంనగర్‌, భూపేష్‌నగర్‌, గుప్తానగర్‌, గణపతినగర్‌, కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంత వాసుల కష్టాలు మరింత దయనీయంగా మారాయి. ఇళ్లలో ఉంటే వరదనీరు ముంచేస్తుందనే భయం..వెళ్తే ఇళ్లలో దొంగలు పడతాయనే భయంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే కాపాల కాస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది.

కొల్లేరుకు ఎగువ నుంచి వస్తున్న వరద కొనసాగుతోంది. కొల్లేరు గ్రామాలతోపాటు పదుల సంఖ్యలో చుట్టు పక్కల గ్రామస్థులు సైతం వరద నీటిలోనే బిక్కుబిక్కు మంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. పెనుమాకలంక, నందిగామలంక, ఇంగిలిపాకలంక, మణుగునూరు, కొవ్వాడలంక, చింతపాడు, దెయ్యంపాడు, పులపర్రు, నుచ్చుమిల్లి, తక్కెళ్లపాడు కొల్లేరు గ్రామాలు పూర్తిగా వరద నీటిలో ఉన్నాయి. కైకలూరు మండలంలోని కొల్లేరు గ్రామాలైన శృంగవరప్పాడు, కొల్లేటికోట, లక్ష్మీపురం, గుమ్మళ్లపాడు, పెంచికలమర్రు, కొట్టాడ, పందిరిపల్లిగూడెం గ్రామాల ప్రజలకు బాహ్య సంబంధాలు తెగిపోయాయి.

విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. అన్ని కోల్పోయి పునరావాస కేంద్రానికి వచ్చిన తమ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యాలో పడ్డట్లుగా మారిందంటున్న వరద బాధితులు.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..