అమెరికా మాకు ఎప్పటికీ శత్రువే ! మా అణ్వస్త్ర సత్తాను పెంచుకుంటాం, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ వార్నింగ్.

| Edited By: Anil kumar poka

Jan 10, 2021 | 12:18 PM

అమెరికాపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఉన్నట్టుండి నిప్పులు చెరిగారు. తమ అణ్వాయుధాల సత్తాను పెంచుకుంటామని..,

అమెరికా మాకు ఎప్పటికీ శత్రువే ! మా అణ్వస్త్ర సత్తాను పెంచుకుంటాం, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ వార్నింగ్.
Follow us on

అమెరికాపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఉన్నట్టుండి నిప్పులు చెరిగారు. తమ అణ్వాయుధాల సత్తాను పెంచుకుంటామని, సబ్ మెరైన్లను సైతం న్యూక్లియర్ పవర్ వ్యవస్థలుగా మలచుకుంటామని, భవిష్యత్తులో దాదాపు మీకు పక్కలో బల్లెం లా ఉంటామని ఆయన యూఎస్ ను హెచ్ఛరించారు. అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని, అది తమకు శత్రు దేశమని ఆయన అన్నారు. సమయం వస్తే ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకుంటాం అన్నట్టు ఆయన మాట్లాడారు. గతంలో అధ్యక్షుడు ట్రంప్ కు, కిమ్ కు మధ్య శాంతి చర్చలు జరిగినప్పటికీ అవి సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయి.  కిమ్ తో చెలిమికి ట్రంప్ యత్నించినప్పటికీ.. కిమ్ మాత్రం ఆయనకు దూరంగానే ఉంటూ వచ్చారు. అమెరికా నూతన అధ్యక్షుడు కానున్న జో బైడెన్ ని ఆయన గ్రీట్ కూడా చేయకపోవడం గమనార్హం. ఇటీవలే తమ దేశ ఆర్థికాభివృద్ది కోసం తానేమీ చేయలేక పోయానని, కొన్ని పొరబాట్లు చేశానని కిమ్ ఈ మధ్య తమ దేశ పాలక వర్కర్స్ పార్టీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

అలాంటిది ఈయన…. అమెరికా శ్వేతసౌధం లోకి జో  బైడెన్ మరి కొన్ని రోజుల్లో అడుగు పెడుతున్న తరుణంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read Also:బీజేపీ’ టుక్ డే టుక్ డే’ గ్యాంగ్, పంజాబ్ ను చీల్చాలని చూస్తోంది, నిప్పులు కక్కిన అకాలీదళ్ చీఫ్.
Read  Also:దేశ ఆర్థికాభివృధ్ది ప్లాన్ అమలులో పొరబాట్లు చేశా, కిమ్ ఒప్పుకోలు, విశ్లేషణ చేసుకుంటున్నా నంటూ ఆవేదన.