జగన్, కేసీఆర్ మైత్రితో జల వివాదాలకు స్వస్తి..!

|

Jun 18, 2019 | 7:01 PM

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల విభేదాలు పరిష్కారం కానున్నాయా..? అత్యంత ప్రధానమైన ఈ సమస్యకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు తమ రాజకీయ ప్రాధాన్యతా అంశంగా భావించడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరైనా, కేసీఆర్.. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాలు సరిసమానంగా వాటాలు పంచుకోవాలని పరోక్షంగా సూచించారు. ఈ విషయంలో ‘ఖడ్గచాలనం’ కాదు.. కరచాలనం.. కావాలని పిలుపునిచ్చారు. ఇందుకు జగన్ కూడా […]

జగన్, కేసీఆర్ మైత్రితో జల వివాదాలకు స్వస్తి..!
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల విభేదాలు పరిష్కారం కానున్నాయా..? అత్యంత ప్రధానమైన ఈ సమస్యకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు తమ రాజకీయ ప్రాధాన్యతా అంశంగా భావించడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరైనా, కేసీఆర్.. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాలు సరిసమానంగా వాటాలు పంచుకోవాలని పరోక్షంగా సూచించారు. ఈ విషయంలో ‘ఖడ్గచాలనం’ కాదు.. కరచాలనం.. కావాలని పిలుపునిచ్చారు. ఇందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. నిజానికి ఈ రాష్ట్రాల మధ్య జల వివాదం ఈ నాటిది కాదు.. లోగడ కృష్ణా వాటర్ డిస్‌‌ప్యూట్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి చెందిన ఏపీ ప్రభుత్వం.. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఈ తీర్పు పట్ల పలు రాజకీయ పార్టీల నేతలు, రైతులు తీవ్ర వ్యతిరేకతను వెలిబుచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ మధ్య ప్రధాన వివాదంగా మారిన ఈ జల పంపిణీ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.

తెలంగాణకు సంబంధించి నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కల్వకుర్తి ప్రాజెక్టు వంటివి ఏ మేరకు ఈ రాష్ట్రానికి నీటిని అందిస్తాయో నిపుణులు ఇంకా విశ్లేషిస్తున్నారు. ఏపీకి కొత్త సీఎం అయిన జగన్.. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై దృష్టి నిలిపి తెలంగాణకు కూడా సమాన వాటా లభించేట్టు చూడగలరని కేసీఆర్ ప్రభుత్వం ఆశిస్తోంది.