‘బావా.. త్వరగా కోలుకో’ కవిత, కేటీఆర్ ఆకాంక్ష

|

Sep 05, 2020 | 5:06 PM

తెలంగాణ ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌ రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎ‌‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. 'గెట్ వెల్ సూన్ బావ' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అటు, కేటీఆర్ సోదరి..

బావా.. త్వరగా కోలుకో కవిత, కేటీఆర్ ఆకాంక్ష
Follow us on

తెలంగాణ ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌ రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎ‌‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. ‘గెట్ వెల్ సూన్ బావ’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అటు, కేటీఆర్ సోదరి.. మాజీ ఎంపీ క‌విత కూడా హరీశ్ రావు కరోనా నుంచి త్వరగా బయటపడాలని కోరుకున్నారు. ‘మా ప్రార్థ‌న‌ల‌న్నీ మీతోనే ఉన్నాయి బావా.. తిరుగులేని మీ సంక‌ల్ప‌శ‌క్తితో క‌రోనా వైర‌స్‌ను ఓడించి అతిత్వ‌ర‌లోనే కోలుకుంటారు’ అని కవిత ఆశాభావం వ్య‌క్తం చేశారు. కాగా, హరీశ్ రావుకు కరోనా వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా శ‌నివారం ఉద‌యం ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఇటీవ‌ల త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన‌వారంతా ఐసోలేష‌న్‌లో ఉండాల్సిందిగా తెలిపారు. ఇక తమ ప్రియతమ నేతకు క‌రోనా అని తెలియడంతో త్వ‌ర‌గా కోలుకోవాలంటూ టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు సోషల్ మీడియాలో తమ సందేశాల్ని పంపుతున్నారు.